BJP Leader Soundararajan Gets Into Public Spat బీజేపి అద్యక్షురాలికి పరాభవం.. విద్యార్థిని అరెస్టు.. బెయిలు

Lois sofia arrested for calling bjp govt fascist gets bail

lois sofia, tamilisai soundararajan, thoothukudi, Tuticorin, BJP, research scholar, BJP govt, fascist, sofia bail, Tamil Nadu, tamil nadu politics

Lois Sofia, the research scholar from Canada who was arrested for sloganeering against the BJP on a flight, in which BJP State president Tamilisai Soundararajan was present, was granted bail on Tuesday.

బీజేపి అద్యక్షురాలికి పరాభవం.. విద్యార్థిని అరెస్టు.. బెయిలు

Posted: 09/04/2018 03:35 PM IST
Lois sofia arrested for calling bjp govt fascist gets bail

తమిళనాడు బీజేపీ చీఫ్ సౌందరరాజన్ తన సహనాన్ని కోల్పోయారు. టుటికోరిన్ విమానాశ్రయంలో అమెకు ఊహించని అనుభవం ఎదురుకావడంతో అమె ఓ ప్రయాణికురాలిపై నోరు పారేసుకున్నారు. తన ప్రయాణికురాలి భావవ్యక్తీకరణకు అమె అడ్డుతగిలారు. ఇది బావ వ్యక్తీకరణ కాదని.. బావాన్ని వ్యక్తీకరించేందుకు ఇది పబ్లిక్ ఫోరమ్ కాదని, ఇది విమానాశ్రయమని అమె అంటున్నా.. విమానాశ్రయంలో మాత్రం బావాలను వ్యక్తపర్చవద్దని అదేశాలు వున్నాయా అంటూ ప్రయాణికురాలు తన వాదనను కొనసాగించింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. తమిళనాడు బీజేపి రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసాయ్ సౌందరరాజన్ టుటీకోరిన్ విమానాశ్రయంలో ప్రయాణించేందుకు వెళ్తుండగా, అదే విమానాశ్రయంలో.. భారత్ లో రీసెర్చ్ స్కాలర్ గా కోర్సును చేస్తున్న కెనడాకు చెందిన లోయిస్ సోఫియా అనే విద్యార్థిని కూడా అదే సమయానికి లోనికి వెళ్లింది. సౌందర్యరాజన్ ను చూడగానే అమె బావోద్వేగానికి లోనై.. ఒక్కసారిగా పెద్దపెట్టున బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ‘‘ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం డౌన్.. డౌన్..’’ అంటూ నినదించింది.

దీంతో తీవ్ర అగ్రహానికి గురైన సౌందర్యరాజన్ తన సహనాన్ని కోల్పోయారు. తీవ్ర ఆగ్రహానికి గురైన సౌందరరాజన్ ఆమెతో వాగ్యుద్ధానికి దిగారు. విమానాశ్రయంలోని పోలీసులు ఎంతగా వద్దని సర్థిచెబుతున్నా వినిపించుకోకుండా అమె తిట్ల పురాణాన్ని అందుకున్నారు. దీంతో పోలీసులు ఎట్టకేలకు అమెకు సర్థిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే బీజేపికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన సదరు ప్రయాణికురాలు సోఫియాను అరెస్టు చేస్తేనే తాను వెళ్తానని డిమాండ్ చేయడంతో తప్పనిసరి పరిస్తితుల్లో పోలీసులు సోఫియాను అదుపులోకి తీసుకున్నారు.
 
ఈ వ్యవహారంపై సౌందరరాజన్ మీడియా ముందు స్పందిస్తూ... ‘‘మధ్య వయస్కురాలైన ఓ మహిళ నన్ను చూడగానే బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలు పెట్టింది. ప్రవేశ ద్వారం వరకు నన్ను వెంబడించింది. ఆమె ప్రవర్తన ప్రమాదకరంగా కనిపించింది. ఆమె ఇలా చేయడం వెనుక ఎవరో ఉన్నారని భావిస్తున్నాను..’’ అని పేర్కొన్నారు. అయితే సోఫియాను కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు అమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కాగా, విమానాశ్రయంలో వీఐపీలతో ప్రమాదకరంగా వ్యవహరించిందన్న సెక్షన్లు న్యాయస్థానం కోట్టివేస్తూ.. పబ్లిక్ న్యూసెన్స్ సహా మరో సెక్షన్ కింద కేసును పరిగణలోకి తీసుకుంది. విద్యార్థిని పక్షం రోజల రిమాండ్ను విధించగా, అమెకు ఇవాళ బెయిల్ ను కూడా మంజూరు చేసింది. అయితే విద్యార్థిని తండ్రి డాక్టర్ ఏఏ సమీ కూడా బీజేపి నేతలపై పిర్యాదు చేశారు. తన కూతురి పట్ల బీజేపి నేతలు అసభ్య పదజాలాన్ని వినియోగించారని, అమెను చంపుతామని కూడా బెరించారని ఫిర్యాదులో పేర్కోన్నారు. దీంతోపాటు తమ కుటుంబానికి చెందిన ఫోటోలను కూడా బీజేపి నేతలు తమ అనుమతి లేకుండా.. బలవంతంగా తీసుకున్నారని అరోపించారు. అయితే సమీ పిర్యాదుపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lois sofia  thoothukudi  Tuticorin  tamilisai soundararajan  BJP  research scholar  

Other Articles