rats eat away the seized drugs: delhi police ఎట్టెట్టా.. ఎలుకలు డ్రగ్స్ తినేశాయా.?

Did rats eat the seized drugs sc questions delhi police

drug case, narcotics cases, rats, seize drugs, seized vehicles, supreme court, Justice Madan B. Lokur, Justice S. Abdul Nazeer, Justice Deepak Gupta,delhi police, crime

The Delhi Police told the Supreme Court bench headed with Justice Madan B. Lokur, Justice S. Abdul Nazeer and Justice Deepak Gupta, that rats eat away seized drugs when narcotics cases come up for hearing.

ఎట్టెట్టా.. ఎలుకలు డ్రగ్స్ తినేశాయా.?

Posted: 09/01/2018 03:20 PM IST
Did rats eat the seized drugs sc questions delhi police

పలువురు నిందితుల నుంచి తాము స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను ఎగ్జిబిట్ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోరడంతో ఢిల్లీ పోలీసులు ఏకంగా మైండ్ బ్లాక్ అయ్యే వింత సమాధానం ఇచ్చారు. వారి సమాధానంతో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు కూడా ఏం చెప్పాలో తెలియక అసహనంతో ఎం తమాజాగా వుందా.? అంటూ కూడా వ్యాఖ్యానించింది. ఇంతకీ ఏమిటీ సమాధానం అంటారా.?

వివిధ కేసుల్లో పట్టుబడ్డ వస్తువులకు కస్టోడియన్ గా వుండే పోలీసులు.. వాటికి సంబంధించిన కేసు విచారణకు వచ్చినప్పడు సంబంధిత వస్తువులను ఎగ్జిబిట్ గా చూపించాల్సి వుంటుంది. నార్కోటిక్స్, డ్రగ్స్ కేసులలో విచారణ సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థాలను న్యాయస్థానంలో చూపించలేకపోయారు. దీంతో అవి ఏమయ్యాయని అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం ప్రశ్నించడంతో.. వాటిని ఎలుక‌లు తినేశాయని ఢిల్లీ పోలీసులు వింత సమాధానం ఇవ్వడంతో న్యాయమూర్తులు ఆశ్చర్యపోయారు. పోలీస్‌ స్టేషన్‌లో డ్రగ్స్‌ భద్రపరిచిన గదుల్లో ఎలుకలు ఉన్నాయని, అవే వాటిని తినేశాయని పోలీసులు చెప్పుకొచ్చారు.

ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లలో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఇతరత్ర చెత్తాచెదారంతో స్టేషన్లలో పరిశుభ్రత కొరవడిందన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణ చేసింది. జస్టిస్ మదన్ బీ లోకూర్ , జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేసును విచారణ చేసింది. కొన్ని ఏళ్లు గడిచినప్పటికీ కూడా స్వాధీనం చేసుకున్న వాహనాలను ఎందుకు విక్రయించలేదని పోలీస్ శాఖను ధర్మాసనం ప్రశ్నించింది. వాహనాల ఓనర్లు తమ వాహనాలను తీసుకునేందుకు రాకపోతే అమ్మేయాలని సూచించింది.

నార్కోటిక్స్ లేదా డ్రగ్స్ కేసులు విచారణకు వచ్చిన సమయంలో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను ఎలుకలు తినేశాయని పోలీసులు కోర్టులకు చెప్పడం ఎంత మేరకు వాస్తవమని జస్టిస్ దీపక్ గుప్తా ప్రశ్నించారు. నార్కోటిక్స్ కేసులు మూడు నాలుగేళ్ల తర్వాత విచారణకు వస్తే పోలీస్ స్టేషన్లలో స్వాధీనం చేసుకుని స్టోర్ రూమ్ లలో ఉంచిన మెటీరియల్ కనిపించదని అది ఏమిటని ప్రశ్నిస్తే ఎలుకలు తినేశాయని పోలీసులు చెబుతున్నారని జస్టిస్ దీపక్ గుప్తా అన్నారు. ఈ క్రమంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం బయటకంటే పోలీస్ స్టేషన్లోని స్టోర్ రూమ్‌ల నుంచే డ్రగ్స్ స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోందని తెలిపింది.

100 కేజీల హెరాయిన్ దొరికితే.. అందులో కొంచెం కూడా స్టోర్ రూమ్‌లో ఉండదని బెంచ్ వ్యాఖ్యానించింది. అంతేకాదు పట్టుబడ్డ వాహనాలకు సంబంధించిన ఓనర్ పోలీస్ స్టేషన్‌కు మూడు నెలల్లోగా రాకపోతే వాటిని ఎందుకు విక్రయించడంలేదని ప్రశ్నించింది. వాహనం విక్రయించాక దాని యజమాని వస్తే ఆ డబ్బును అతనికి చెల్లించండి లేదా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో వేయండి అంటూ ఆదేశించింది. దీనికి సమాధానం ఇచ్చిన పోలీస్ శాఖ... స్వాధీనం చేసుకున్న వాహనాలు కోర్టు సొత్తని తాము కేవలం కస్టోడియన్‌గానే వ్యవహరిస్తామని తెలిపింది. పిటిషన్‌ను విన్న సుప్రీంకోర్టు అక్టోబర్ 10 కేసును వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : drug case  narcotics cases  rats  seize drugs  seized vehicles  supreme court  delhi police  crime  

Other Articles