Rupee Collapses To New Record Low రూపాయి పతనం.. తొలిసారిగా 71కి మారకం విలువ

Rupee crashes to all time low of rs71 against dollar

dollar, indian currency, forex, Indian Rupee, rupee, dollar, USD, INR, nationalized banks

The rupee slumped to a fresh record low of 71 against the dollar for the first time ever by falling 26 paise on persistent demand for the US currency amid rising crude prices.

రూపాయి పతనం.. తొలిసారిగా 71కి మారకం విలువ

Posted: 08/31/2018 04:34 PM IST
Rupee crashes to all time low of rs71 against dollar

రూపాయి విలువ పతనం కొనసాగుతుంది. ఇవాళ రూపాయి విలువ మరింత క్షీణించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పడిపోయి తొలిసారిగా రూ.71కి చేరింది. అమెరికా డాలరుకు పెరుగుతున్న డిమాండ్‌తో పాటు ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి విలువ 26 పైసలు పడిపోయింది. రూపాయి నిన్నటి సెషన్‌లో రూ.70.74 వద్ద ముగిసింది. ఈరోజు ఫారెక్స్‌ ట్రేడింగ్‌ ఆరంభంలో రూ.70.95పైసల వద్ద ప్రారంభమైంది.

తర్వాత మరింతగా క్షీణించి రూ.71 వద్ద తాజా జీవన కాల గరిష్ఠానికి చేరింది. చమురు దిగుమతిదారుల నుంచి డాలరుకు గిరాకీ పెరగడం, చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ద్రవ్యోల్బణ భయాలు వెంటాడం రూపాయి క్షీణతకు దారితీస్తోంది. అలాగే చైనా-అమెరికాల మధ్య వాణిజ్య భయాలు కూడా దేశీయ కరెన్సీలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.94 వద్ద ట్రేడవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dollar  indian currency  forex  Indian Rupee  rupee  dollar  USD  INR  nationalized banks  

Other Articles