తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సినీపరిశ్రమ నటుడు హరికృష్ణ అంతక్రియలు తెలుగు రాష్ట్రాలతో పాటు సినీ, రాజకీయ పరిశ్రమకు చెందిన ప్రముఖులు విషాదంలో వుండగానే మరో విషాదవార్త వినిపించింది. ప్రముఖ దర్శకురాలు బి.జయ (54) గుండెపోటుతో క్రితం రోజు రాత్రి 9:30 గంటల సమయంలో మృతి చెందారు. సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జయ 2003లో 'చంటిగాడు' సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించారు. అంతకుముందు సినీ జర్నలిస్టుగా పనిచేశారు.
అయితే, సినిమాలపై మక్కువతో ఆమె దర్శకత్వ రంగంవైపు అడుగుపెట్టారు. ప్రేమికులు, గుండమ్మగారి మనువడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. కామ్న జెఠ్మలానీ, శాన్వి, సుహాసిని వంటి కథానాయికలను పరిచయం చేసింది జయనే. ప్రముఖ సినీ పాత్రికేయుడు, పీఆర్వో బీఏ రాజు ఆమె భర్త. ఆంగ్ల సాహిత్యం, సైకాలజీలో ఎమ్మే చేసిన జయ తొలుత సినీ పాత్రికేయురాలిగా పనిచేశారు. ఆ తర్వాత మెగాఫోన్ చేపట్టి ఐదు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆమె తీసిన ఆఖరు చిత్రం ‘వైశాఖం’.
కాగా, అమెకు పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని జయ స్వగృహంలో ఆమె భౌతికకాయానికి మహేశ్‌బాబు దంపతులు, వెంకటేశ్, వంశీ పైడిపల్లి, సుకుమార్, ఆది, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, నందినిరెడ్డి, ఝాన్సీ, ఉత్తేజ్, గుణశేఖర్, నృత్యదర్శకుడు శేఖర్, మంచు మనోజ్ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. జయ కుటుంబసభ్యులను పరామర్శించారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more