Petrol and diesel prices record new highs ఆకాశానికి ఇంధన ధరలు.. వాహనదారుల జేబులు గుల్ల

Petrol and diesel prices record new highs diesel breaches 70 mark in new delhi

Petrol price, Record high, Rupee, New Delhi, largest fuel retailer, ioc, indian oil corporation, global crude oil prices, dollar, Diesel price, oil price, crude oil, price hike, petrol, diesel,

Fuel prices have been on a continuous rise recently, petrol and diesel prices in the national capital raised by 22 paise per litre and 28 paise per litre, respectively, on the back of rising global crude oil prices, depreciating rupee and increase in cost and freight prices

ఆకాశానికి ఇంధన ధరలు.. వాహనదారుల జేబులు గుల్ల

Posted: 08/31/2018 04:35 PM IST
Petrol and diesel prices record new highs diesel breaches 70 mark in new delhi

పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆల్ టైం రికార్డ్ దిశగా దూసుకెళ్తున్నాయి. ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి పతనమవడంతో దేశీయ మార్కెట్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు రెక్కలొస్తున్నాయి. లైఫ్ టైం హైకి చేరి పరుగులు పెడుతూ.. వానహాదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. క్రితం రోజున మునుపెన్నడూ లేని గరిష్ఠధరకు చేరిన డీజిల్.. ఇవాళ మరింత పెరిగి నిన్నటి రికార్డును అధిగమించింది. కాగా, అదే బాటలో నడుస్తున్న పెట్రోల్‌ కూడా లైఫ్ టైం హై ధరకు చేరింది.

ఇండియన్‌ ఆయిల్‌ ధరల ప్రకారం.. దేశ రాజధానిలో శుక్రవారం లీటర్ పెట్రోల్‌ ధర 22 పైసలు పెరిగి రూ. 78.52గా ఉంది. లీటర్‌ డీజిల్ ధర 28 పైసలు పెరిగి రూ. 70.21గా ఉంది. లీటర్ పెట్రోల్‌ ధర ముంబయిలో రూ. 85.93, కోల్‌కతాలో రూ. 81.44, చెన్నైలోని 81.58గా ఉంది. లీటర్‌ డీజిల్ ధర ముంబయిలో రూ. 74.54, కోల్‌కతాలో రూ. 73.06, చెన్నైలో రూ. 74.18గా ఉంది. ఈ ఏడాది మే నెలలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే.

మే 29న దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్‌ ధర రూ. 78.43గా ఉంది. తాజా పెంపుతో ఆ రికార్డును దాటి పెట్రోల్‌ ధర జీవనకాల గరిష్ఠానికి చేరింది. ముడి చమురు ధరలు పెరగడంతో పాటు చమురు రవాణాపై విధిస్తున్న ఎక్సైజ్‌ సుంకం కారణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అయితే ఈ ధరల పెంపుతో వాహనదారులు బెంబేలెత్తి పోతున్నారు. తమ జేబులకు తూట్లు పెడుతున్న కేంద్రం.. గతంలో పెంచిన ఎక్సైజ్ సుంఖాన్ని తగ్గించాలని కూడా డిమాండ్లు పెరుగుతున్నాయి. గతంలో 80కి చేరితేనే అందోళను చేసిన బీజేపి.. ఇప్పుడు అంతకు ఫైకి ఎగబాకినా ప్రజలనెత్తిన మాత్రం పన్ను భారం మోసుతుందని విపక్షాలు అరోపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : oil price  crude oil  price hike  petrol  diesel  goods and service tax  

Other Articles