chiranjeevi condolence to Nandamuri Harikrishna హరికృష్ణ మృతిపై చిరంజీవి భావోద్వేగం

Chiranjeevi ram charan condolence to nandamuri harikrishna

nandamuri harikrishna, condolence, chiranjeevi, Ram charan, Tollywood, nandamuri harikrishna last rites, nandamuri harikrishna last journey, nandamuri harikrishna chaitanya ratham, nandamuri harikrishna ntr trust bhavan, nandamuri harikrishna dead, nandamuri harikrishna car crash, nandamuri harikrishna, kamineni hospital, Road accident, nalgonda, Khammam district, Junior NTR, crime

tollywood mega star chiranjeevi along with his son and mega power star ram charan pay tributes to Nandamuri Harikrishna, and expresses his deep condolence to his family members.

హరికృష్ణ మృతిపై చిరంజీవి భావోద్వేగం

Posted: 08/29/2018 08:09 PM IST
Chiranjeevi ram charan condolence to nandamuri harikrishna

సినీనటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ హఠాన్మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర బావోద్వేగానికి గురయ్యారు. మరణవార్త తెలియడంతో షూటింగ్ రద్దు చేసుకుని హరికృష్ణ నివాసానికి వచ్చిన ఆయన హరికృష్ణ బౌతికఖాయాన్ని సందర్శించి తన నివాళులు అర్పించారు. తారక్, నందమూరి కల్యాణ్ రామ్, బాలకృష్ణలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

తన తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ తో కలసి వచ్చిన చిరంజీవి ఈ సందర్భంగా మాట్లాడుతూ హరికృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. హరికృష్ణ ఇలా హఠాన్మరణం చెందడం నిజంగా దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఇది చాలా దుర్దినం, చాలా దురదృష్టం. మిత్రుడు, ఎంతో ఆప్యాయంగా పలకరించే నా సోదర సమానుడు నందమూరి హరికృష్ణ అకాల మరణంతో దిగ్భ్రాంతికి గురయ్యాం. మనసుని కలిచివేసిందని అన్నారు.

‘ఎప్పుడు కలిసినా ఎంతో ప్రేమా, ఆప్యాయతలతో పలకరించేవారు. కలిసిన కొద్దిసేపు ఎంతో సరదాగా మాట్లాడుతూ జోక్స్ వేస్తూ నవ్వించే హరిక్రిష్ణ గారు ఇలా మమ్మల్ని శోకంలో వదిలేసి వేళతారని ఊహించలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యం ఉండాలని దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని చిరంజీవి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Harikrishna  condolence  chiranjeevi  Ram charan  Tollywood  

Other Articles