25 MLAs Ready to Join Janasena జనసేనలోకి పార్టీలోకి 25 మంది ఎమ్మెల్యేలు..

25 mlas ready to join pawan kalyan s janasena claims party leaders

pawan kalyan, janasena, Pawan Kalyan bus Yatra, andhra pradesh convener, Pardhasaradhi, 20 MLA, TDP. YCP. Rajamahendravaram, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, pawan kalyan ichhapuram yatra, Pawan Kalyan uttatandhra yatra, Pawan Kalyan gangapooja, andhra pradesh, politics

Janasena Andhra Pradesh Convener, Pardhasaradhi went on to say that as many as 20 MLAs both from TDP and YSR Congress are in touch with their party and are ready to jump the fence as soon as Pawan Kalyan gives his nod.

జనసేనలోకి పార్టీలోకి 20 మంది ఎమ్మెల్యేలు.. పలువురు సీనియర్లు..

Posted: 08/25/2018 12:23 PM IST
25 mlas ready to join pawan kalyan s janasena claims party leaders

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరందుకోగా.. ఏపీలోనూ ఎన్నికల వాతావారణం వేడెక్కింది. పార్టీలు చేరికలను ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా తొలిసారి ఎన్నికల బరిలో దిగబోతున్న సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరడానికి ఏకంగా నాయకులు క్యూ కడుతున్నారా.? అంటే ఔనన్న సమాధానమే వినబడతుతుంది. అయితే ఇప్పటికే అవినీతి, అక్రమాలకు పాల్పడి.. జనం చేత విమర్శలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు, నాయకులకు మాత్రం తమ పార్టీలోకి ఎంట్రీ లేదని ఇప్పటికే పవన్ కల్యాణ్ తేల్చిచెపిన విషయం తెలిసిందే.

పవన్‌తో 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని జనసేన నాయకులు ప్రకటించడం గతంలో సంచలనమైంది. తాజాగా జనసేన పార్టీ రాష్ట్ర కన్వీనర్ వి.పార్థసారథి మరోసారి అలాంటి ప్రకటనే చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని పార్థసారథి తెలిపారు. ఆ ఎమ్మెల్యేలంతా ఇప్పటికే పవన్‌తో చర్చించారని, ఆయన నిర్ణయం తీసుకుని, తేదీ ఖరారు చేసిన తర్వాత వారంతా వచ్చి పార్టీలో చేరుతారని పేర్కొన్నారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనేతలు కూడా జనసేనలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పాత, కొత్త తరం మేలు కలయికతో పార్టీ ముందుకెళ్తుందని ఆయన తెలిపారు.

అయితే సీనియర్ నాయకులు, సిట్టింగ్ నేతలు ఎంతమంది చేరినా.. తమ పార్టీలో నవతరానికి 60 శాతం సీట్లు ఇచ్చేందుకు పవన్ కల్యాన్ నిర్ణయించారని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల కోసం రాష్ట్రం మొత్తానికి ఓ మేనిఫెస్టో, ఒక్కో నియోజకవర్గానికి ఒక్కోటి చొప్పున మేనిఫెస్టోలు తయారుచేస్తామని పార్థసారథి వివరించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు మేడా గురుదత్ ప్రసాద్, ఉభయ జిల్లాల కన్వీనర్ కలవకొలను తులసితో కలిసి రాజమహేంద్రవరంలో పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles