WhatsApp turns down Modi government’s demand కేంద్రం చెప్పినట్టు చేయడం కుదరదు.. షాకిచ్చిన వాట్సాప్

Whatsapp turns down india s demand to build traceability software

whatsapp, fake news on whatsapp, whatsapp reply to modi govt, mob lynching messages on whatsapp, ravi shankar prasad, whatsapp data leak, fake news, traceable software, union government, encryption

WhatsApp said it can’t build software to trace origin of a message on its platform, turning down a demand from the Indian government that wanted such a solution to track fake or false information that has led to crimes like mob-lynching.

కేంద్రం చెప్పినట్టు చేయడం కుదరదు.. షాకిచ్చిన వాట్సాప్

Posted: 08/24/2018 02:00 PM IST
Whatsapp turns down india s demand to build traceability software

కేంద్రప్రభుత్వం అదేశాలను పాటించడం.. తమ వల్ల కాదని, అలా చేస్తే తమ ఉనికే ప్రమాదం పోంచివుంటుందని మెసేజింగ్ యాప్ వాట్సాప్ తేల్చిచెప్పింది. తప్పుడు సమాచారాన్ని, ఫేక్ న్యూస్ లను సృష్టిస్తున్న వ్యక్తులు ఎవరన్న విషయాన్ని తెలుసుకునేందుకు వీలుగా తాము కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు చేయడం సాధ్యం కాదని షాకిచ్చింది. తమ మెసేజింగ్ యాప్ పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టెడ్ అని.. ఈ నేపథ్యంలో ఈ సాప్ వేర్ ను పొందుపరిస్తే.. తమ మెసేజింగ్ యాప్ లో భద్రత కరువైందని యూజర్లు తమకు దూరమయ్యే ప్రమాదముందని వాట్సాప్ స్పష్టం చేసిందిజ

ఇన్నాళ్లు లేని ఈ నిబంధనలు ఇప్పుడెందుకు అమలు పర్చాలని కేంద్రం ఒత్తడి చేస్తుందంటే.. వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు స్యూరకిరణాల కన్నా వేగంగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్.. వాటిలో వాట్సాప్ లేకుండా వుండటం రమారమి లేరనే చెప్పాలి. ఈ క్రమంలో ఇటీవల ఈ వాట్సాప్ గ్రూపులలో షేర్ అవుతున్న తప్పుడు సమాచారం పలువురు అమాయకుల ప్రాణాలను కూడా బలిగొంటుంది. ఇందుకు ఉదాహరణ మూక హత్యలు, దేశంలోని ఉత్తర భాగన గోమాంసం తరలిస్తున్నారన్న సమాచారంతో మూకహత్యలు.. ఇటు దక్షిణాన పిల్లలను ఎత్తుకెళ్తున్నారన్న సమాచారంతో అమాయకులను అనుమానితులుగా భావించి మూకహత్యలు వెలుగులోకి వచ్చాయి.

దీంతో అనేకమంది అమాయకులు తమ ప్రాణాలను కొల్పోతున్నారు. అయితే ఇదీ కారణమే అయినా.. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచిన తరువాత ఇప్పుడు వీటిపై అంక్షలను విధించడం.. ఫేక్ న్యూస్ ను ట్రేస్ చేసే సాప్ట్ వేర్ ఏర్పాటు చేయాలని అదేశించడానికి అసలు కారణమం వేరే వుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల వేళ తమ పార్టీకి వ్యతిరేకంగా వెళ్లే ప్రచారాలను కట్టడి చేసేందుకు.. బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇలాంటి అదేశాలను పంపిందని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఫేక్ న్యూస్ సృష్టికర్తలను గుర్తించేందుకు గాను సరికొత్తగా ట్రేసెబుల్ సాఫ్ట్ వేర్ రూపొందించలేమని తేల్చి చెప్పింది. ఈ సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తే తమ వాట్సాప్ లోని ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టెడ్ అన్న భద్రతకే విఘాతం కలుగుతుందని స్పష్టం చేసింది. అది వాట్సాప్ స్వభావాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందని పేర్కొంది. వాట్సాప్ దుర్వినియోగం అవుతుందన్న కారణంతో నిబంధనలను మార్చలేమని కుండబద్దలు గొట్టింది.

వాట్సాప్ పై పూర్తి విశ్వాసంతో సున్నితమైన, అత్యంత రహస్యమైన విషయాలను కూడా అందులో పంచుకుంటున్నారని, ప్రభుత్వ ఆదేశాలతో వారి నమ్మకాన్ని వమ్ము చేయలేని పేర్కొంది. వైద్యులు, బ్యాంకులు, కుటుంబ సభ్యులు అత్యంత రహస్యమైన సంభాషణలకు దానిని వినియోగించుకుంటున్నారని వాట్సాప్ ప్రతినిధి తెలిపారు. అయితే, ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం షేర్ కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : whatsapp  fake news  traceable software  union government  encryption  

Other Articles