Harvard professor trolled by South Indians హార్వర్డ్ ప్రొఫెసర్ ను ట్రాట్ చేస్తున్న సౌత్ ఇండియన్స్..

Harvard professor calls coconut oil pure poison indians beg to differ

coconut oil, coconut oil benefits, coconut oil in food, coconut oil in moderation, coconut oil is pure poison, Good skin, Harvard, Harvard professor, health benefits, Healthy Hair, India, kerala, netizens, poison, pure poison, science, south India, Tamil Nadu, turmeric, twitter, unhealthy, vegan

Karin Michels, professor of epidemiology at Harvard T.H. Chan School of Public Health, says that coconut oil is all kinds of unhealthy and resorts to calling it "poison" at least three times.

హార్వర్డ్ ప్రొఫెసర్ ను ట్రాట్ చేస్తున్న సౌత్ ఇండియన్స్..

Posted: 08/24/2018 12:41 PM IST
Harvard professor calls coconut oil pure poison indians beg to differ

దేశంలోకి అడుగుపెట్టిన బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఒకప్పుడు తప్పుడు వార్తలను బాగా ప్రచారం చేసి.. తమ ఉత్పత్తులకు ఆదరణ లభించేలా చేసుకున్నారు. తీరా ఒక తరం మారిన తరువాత అప్పడు తప్పని చెప్పిన ప్రచారాలను.. ఇవాళ ఒప్పని చెబుతూ.. వాటి గురించి మనకు తెలిసిన విషయాలనే కొత్తగా చెబుతూ ఇలా మరోమారు తమ ఉత్పత్తులకు డిమాండ్ ను పేంచేసుకుంటున్నారు.

ఓ దంత మంజన్, టూత్ పేస్ట్ సంస్థ గతంలో బొగ్గుతో దంతాలను శుభ్రం చేసుకోవడం సముచితం కాదని కూడా ప్రకటనలు గుప్పించాయి. తాజాగా అదే మంచిదని ప్రచారాన్ని చేసుకోవడం కొసమెరుపు. మీ టూత్ పేస్టులో బోగ్గు వుందా.. ఉప్పు వుందా.. అంటూ ప్రచారాన్ని ఊదరగొడుతుంది. అయితే అప్పట్లో మనవాళ్లకు అంతగా అవగాహన లేక.. దానిని వ్యతిరేకించిన వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సామాజిక మాద్యమాలు కూడా లేక బహుళజాతి సంస్థల ప్రచారాన్ని ప్రజల మెదళ్లలోకి బలవంతంగా వెళ్లేలా చేసి.. తమ ఉత్పత్తులకు డిమాండ్లు పెరిగేలా చేసుకున్నాయి.

తాజాగా మన సంస్కృతిలో భాగమైన కొబ్బరి నూనెపై కూడా విషం చిమ్ముతున్నారు. తలంటుకున్న ప్రతీసారి అందుకుముందు తలకు మంచిగా కొబ్బరినూనెను పట్టించడం దాదాపుగా అందరూ చేసే పని. కొబ్బరినూనెతో వెంట్రుకలు వత్తుగా, చక్కగా, పొడుగ్గా, పెరుగుతాయని, ఇక ఇదే నూనెతో శరీరాన్ని మర్థనం చేయడం వల్ల శరీరం కూడా నిగారిస్తుందని కూడా పెద్దలు చెబుతారు. ఇక పచ్చి కొబ్బరిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయన్నది నిపుణులు మాట. కానీ హార్వర్డ్ కు చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ మాత్రం చిత్రమైన వాదనను తెరపైకి తీసుకొచ్చింది. కొబ్బరి నూనె పచ్చి విషమనీ, దానికి దూరంగా ఉండాలని హెచ్చరించింది.

ఇటీవల అమెరికాలో జరిగిన ఓ సమావేశంలో హార్వర్డ్ వర్సిటీకి చెందిన కరిన్ మిచెల్స్ అనే మహిళా ప్రొఫెసర్ ఈ వ్యాఖ్యలు చేసింది. కొబ్బరినూనె అన్నది అన్ని రోగకారకాలకు నిలయమని ఆమె వ్యాఖ్యానించింది. దానికి దూరంగా ఉండాలనీ, అది పచ్చి విషమని సెలవిచ్చింది. మనుషుల తీసుకోదగ్గ అత్యంత చెత్త ఆహారం ఇదేనని చెప్పింది.ఈ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేయగా ఇప్పటివరకూ దాదాపు 10 లక్షల మంది చూశారు.

కాగా,  కరిన్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగానే స్పందించారు. కొబ్బరి నూనె విషం అయితే హవాయి, ఫిలిప్పీన్స్, థాయ్ లాండ్ ప్రజలు తరతరాలుగా విషం తీసుకుంటున్నట్లే అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. నందిని అనే మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘భారత్ లో తల్లులు తమ పిల్లలకు కొబ్బరినూనెతో మర్దన చేస్తారు. ప్రజలు తలకు రాసుకుంటారు. ఒక్క అమెరికాలో మాత్రమే ప్రతిదాన్నీ భూతద్దంలో చూస్తున్నారు’ అంటూ మండిపడింది. మిగతా భారతీయుల కంటే కొబ్బరినూనె ఆహారంలో భాగంగా తీసుకున్న ప్రజల ఆయుర్దాయం ఎక్కువగా ఉందని పంకజ్ అనే మరో నెటిజన్ చురకలంటించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles