EC rules out one nation, one poll జమిలి ఎన్నికలకు చెల్లుచీటీ.. కుదరదన్న ఈసీ..

Election commission rules out possibility of one nation one poll

2019 Lok Sabha Elections #Assembly Polls #EC #Election Commission #OP Rawat #General Elections #Lok Sabha Elections 2019 #One Nation One Poll #OP Rawat #VVPATs #Amit Shah #BJP #PM Modi #simultaneous polls

Chief Election Commissioner OP Rawat emphatically ruled out the possibility of holding simultaneous elections to the state assemblies along with the Lok Sabha polls.

జమిలి ఎన్నికలకు చెల్లుచీటీ.. కుదరదన్న ఈసీ..

Posted: 08/24/2018 11:52 AM IST
Election commission rules out possibility of one nation one poll

దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటే రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని జెమిలీ ఎన్నికలను ఓ వైపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, మరోవైపు బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అనేక సందర్భాల్లో ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చినా అది సాథ్యమయ్యే పనికాదని అటు కేంద్రం.. ఇటు పార్టీ అశలపై ఎన్నికల సంఘం నీళ్లు చల్లింది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ప్రతిపాదన అచరణ సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. దీంతో పాటు పలు రాష్ట్రాలతో కలసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలపై కూడా ఎన్నికల సంఘం కుదరదని స్పష్టం చేసింది.

జమిలి ఎన్నికలు నిర్వహించడం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికాదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. దీంతో పాటు ముందస్తు ఎన్నికలకు కూడా అవకాశం లేదని తేల్చి చెప్పారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలు అవసరమని పేర్కొన్న రావత్ అందుకు లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలపాలని పేర్కొన్నారు. ఒకవేళ సవరణలకు అంగీకరిస్తే అందుకు చట్ట సభ్యులు కనీసం ఏడాది సమయం తీసుకుంటారని, కాబట్టి ప్రస్తుతానికి జమిలికి వెళ్లే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు.

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సాధారణంగా 14 నెలల ముందుగానే కార్యాచరణ ప్రారంభిస్తామని రావత్ పేర్కొన్నారు. తమ వద్ద 400 మంది సిబ్బందే ఉన్నారని, అయితే, ఎన్నికల నిర్వహణకు మాత్రం కోటిమందికిపైగా వినియోగించుకుంటామని పేర్కొన్నారు. జమిలి ఎన్నికల విషయానికి వస్తే అదంత ఆషామాషీ కాదన్నారు. సిబ్బంది, భద్రత, ఈవీఎంలు, వీవీపాట్‌ తదితర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని.. అదంతా ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికాదని తేల్చి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles