netizens fire on Karnataka Minister Revanna మంత్రి రెవన్నాపై నెట్ జనుల మండిపాటు

Viral video minister throws biscuit packets at flood victims

throws relief material,Public Works Minister,Karnataka floods,hd revanna,Caught on cam, BJP, H D Revanna, CM HD kumara swamy, elder brother of CM, Flood Victims, Biscuit Packets, Karnataka Public Works Department, karnataka

Karnataka minister H D Revanna, is facing the flak after a video of him throwing biscuit packs at the people who have lost homes and crops due to rain and flood went viral.

ITEMVIDEOS: మంత్రి చర్యలపై నెట్ జనుల ఆగ్రహం.. ఇదేనా సేవా.?

Posted: 08/20/2018 03:17 PM IST
Viral video minister throws biscuit packets at flood victims

కర్ణాటక మంత్రి అత్యుత్సాహంపై వివాదం రేగుతోంది. వరద బాధితుల పట్ల ఆయన ప్రవర్తించిన తీరు విమర్శల పాలవుతోంది. ప్రజలకు సేవకుడిగా వుంటామంటూ ప్రమాణాలు చేసి.. అధికారంలోకి వచ్చి రాగానే తమ నిజస్వారూపాన్ని చూపుతున్నారంటూ నెట్ జనులు మండిపడుతున్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత మరో ఐదేళ్ల వరకు ప్రజలతో పనిలేదని మంత్రిగారు ఇలా ప్రవర్తించారా.. లేక ఆయన దృష్టిలో ప్రజలంటే అంతటి చిన్న చూపా అంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు.

ఇంతకీ ఆ అమాత్యులవారు ఎవరు.? ఆయన చేసిన తప్పేంటనే కదా మీ సందేహం. ఆయన మరెవరో కాదు.. స్వయంగా ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి పెద్దన్న రేవణ్ణ.. ప్రభుత్వం కారులో రోజుకు 300 కిలోమీటర్ల దూరం వెళ్ళివస్తూ ఇప్పటికే ప్రజధానాన్ని ఆయన ఇందధనం కోసం తెగవాడేస్తున్నారన్న విమర్శలను ఎదుర్కొన్న ఆయన తాజగా మరోమారు నెట్ జనుల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలలో వరదలు రావడంతో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. అక్కడి ఇళ్లలోకి నీళ్లు చేరడంతో.. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆశ్రయం కల్పిస్తోంది ప్రభుత్వం.

ఇంతవరకు సరే కానీ ఇక్కడే వచ్చి అసలు సమస్య. అదేంటంటే.. సీఎం అదేశాలతో జిల్లా ఇంచార్జి మంత్రలు తమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవాళ్లను పరామర్శించారు. అనంతరం ప్రభుత్వం తరపున అందిస్తున్నఆహార పొట్లాలను పంచి పెట్టారు. ఇక్కడే వ్యవహారం తేడా కొట్టింది. మంత్రి ఆహార పొట్లాలను పంచి పెట్టాల్సింది పోయి.. ఆ ప్యాకెట్లను విసిరేశారు. ఈ సీన్ మొత్తాన్ని ఎవరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. దీంతో నెట్ జనులు ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం ఇళ్లిళ్లూ తిరగినప్పుడు లేని అహంభావం ఇప్పుడెందుకు అంటూ నిలదీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles