marriage cancelled for Rs 3000 in chittoor మూడు ముళ్ల బంధానికి బ్రేక్ వేసిన రూ.3 వేలు..

Money makes many things rs 3000 cancells even marriage

marriage cancelled, golden ring groom bride, golden ring bride groom, marriage ring, Rs. 3000, Rs 3 thousand ring, marriage cancelled for 3 thousand, dowry ring, punganur, palamaner, andhra pradesh

Rs Three Thousnad golden ring made a couples marriage cancelled as the bride and groom families take the issue as prestage. Few elders tried for compromise but ends of no result. this incident occured in palamaner city of punganur mandal of chitoor in andhra pradesh state.

మూడు ముళ్ల బంధానికి బ్రేక్ వేసిన రూ.3 వేలు..

Posted: 08/20/2018 04:09 PM IST
Money makes many things rs 3000 cancells even marriage

ధనం మూలం ఇదం జగత్ అన్న సూక్తి ప్రస్తుతం అన్ని వర్గాల వారు తమ శక్తి కొలది పాటిస్తున్నారని తెలుసు కానీ.. తమ కన్నబిడ్డ మరో తరానికి నాంది పలుకుతున్న శుభ తరుణంలో మాత్రం శక్తికొలది డబ్బును వెచ్చించి మరీ ఖర్చుపెట్టి ఘనంగా కల్యాణ కార్యక్రమాన్ని జరిపిస్తారన్నది తెలిసిందే. అయితే ఇక్కడ జరిగింది మాత్రం వేరు. కేవలం మూడంటే మూడు వేల కోసం మొదలైన ఓ చిన్న గొడవ.. మూడుముళ్ల బంధంతో ఒకటి కావాల్సిన వధూవరులను విడదీసింది. ధనం శక్తి ముందు ఏ శక్తి మనజాలదని మరోసారి రుజువుచేస్తూ.. వధూవరులను ఎవరిదారిన వారు వెళ్లడానికి కారణమైంది. చిత్తూరు జిల్లాలోని పలమనేరులో జరిగిందీ ఆసక్తికర సంఘటన.

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి, పలమనేరు పట్టణానికి చెందిన యువకుడితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఆగస్టు 19 ఆదివారం రోజున ఉదయం పెళ్లికి ముహుర్తం కూడా నిర్ణయించారు. పెళ్లికి కావల్సిన అన్ని ఏర్పాట్లను అంగరంగ వైభవంగా పూర్తి చేశారు. అయితే పెళ్లి సమయంలో వరుడికి ఓ బంగారు ఉంగరం పెడతామని వధువు తల్లిదండ్రులు నిశ్చితార్థం సమయంలో ఒప్పుకున్నారు. సరిగ్గా ముహుర్త సమయానికి బంగారు ఉంగరం పెట్టాల్సిందేనంటూ, వరుడి తరుపు బంధువులు పట్టుబట్టారు. అయితే ఇంతకుముందు పెళ్లి బట్టల షాపింగ్ సమయంలో వరుడు, వధువు కుటుంబం నుంచి మూడు వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. కానీ పెళ్లి నాటికి కూడా తిరిగి చెల్లించలేదు.

వరుడి బంధువులు ఉంగరం కోసం పట్టబట్టగా.. ఆ డబ్బును తిరిగి చెల్లిస్తేనే ఉంగరం పెడతామని వధువు తరుపు బంధువులు తేల్చిచెచెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. మాటా మాటాపెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రూ. 3 వేల కోసం ఇంత రాద్ధాంతం జరగడంతో పెళ్లికొడుకూ, పెళ్లి కూతురు కూడా గొడవ పడి ఇద్దరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. సర్దిచెప్పడానికి కొందరు బంధువులు ప్రయత్నించినా, సఫలం కాలేదు. వధూవరులు ఎవరిదారిని వారు వెళ్లిపోయారు. బంధువులు కూడా వారిని అనుకరించారు. దీంతో లక్షలు ఖర్చుపెట్టి చేసిన పెళ్లి ఏర్పాట్లు, కేవలం మూడు వేల రూపాయల కారణంగా వృథా అయిపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : marriage  dowry  golden ring  bride  groom  punganur  palamaner  chitoor  andhra pradesh  

Other Articles

 • Model diksha singh to contest up panchayat elections 2021

  ఉత్తర్ ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో గ్లామర్ డోసు..!

  Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more

 • Anand mahindra fulfills promise tn s famous idli amma gets new home workspace

  ఇడ్లీ బామ్మకు ఇల్లు కట్టించిన పారిశ్రామిక వేత్త

  Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more

 • Elangana mlas took drugs at bengaluru party police probe reveals

  బెంగళూరు డ్రగ్స్ కేసు: తెలంగాణలో బయటపడిన లింకులు

  Apr 03 | బెంగళూరు డ్రగ్స్‌ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more

 • Himanta biswa sarma pleads to revoke ban after ec bars him from campaigning

  హిమాంత తరువాత సుశాంతపై కూడీ ఈసీ బదిలీ వేటు

  Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more

 • Bjp lodges complaint against udhayanidhi stalin for remark against pm modi

  ప్రధాని మోదీపై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

  Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more

Today on Telugu Wishesh