Senior citizen gagged by robbers, dies దొంగల చేతిలో ప్రాణాలు కొల్పోయిన వృద్ద వ్యాపారి

Hyderabad senior citizen murdered burglars make off with rs 50 lakh and gold

Murder, senior citizen, rajendra prasad agarwal, taramani, deepak, rohit, sirimalle colony, hyderabad police, robbery, Hyderabad, Telangana, crime

A senior citizen was murdered in Hyderabad allegedly by burglars who stole Rs 50 lakh and 40 tola gold worth Rs 10 lakh from his duplex home at Rajendranagar

దొంగల చేతిలో ప్రాణాలు కొల్పోయిన వృద్ద వ్యాపారి

Posted: 08/18/2018 11:04 AM IST
Hyderabad senior citizen murdered burglars make off with rs 50 lakh and gold

హైదరాబాదలో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఓ వైపు నగరంలో తీవ్ర కలకలం సృష్టించిన చెడ్డీగ్యాంగ్ దొంగల ముఠాను గుజరాత్ వెళ్లి సినీపక్కీలో చేజింగ్ లు చేసి మరీ పట్టుకుని వచ్చి కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు తమ ఘనతను చాటుకున్నంతలోనే నగరంలో మరోమారు తాము ఉన్నామని తమ దొంగతనాలతో దొంగలు అలజడి సృష్టిస్తున్నారు. రాజేంద్రనగర్ లో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ దంపతుల ఇంట్లోకి చొరబడి.. కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్లు వేసి దోచుకున్నారు. రూ.50 లక్షల నగదు, 50 తులాల బంగారం దోచుకున్నట్టు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దోపిడీ ఘటనలో ఇంటి యజమాని అయిన వృద్దుడు మృతి చెందాడు.

పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక సిరిమల్లె కాలనీలో రాజేంద్రప్రసాద్ అగర్వాల్ (66), తారమణి (62) నివస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారులు దీపక్, రోహిత్ ఉన్నారు. వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. రాజేంద్రప్రసాద్ గతంలో బేగం బజార్‌లో కిరాణా దుకాణం నిర్వహించేవారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటి వెనక నుంచి లోపలికి ప్రవేశించిన దుండగులు నిద్రిస్తున్న దంపతుల కాళ్లు, చేతులను షూ లేసులతో కట్టివేశారు. అరవకుండా నోటికి, ముక్కుకి ప్లాస్టర్లు వేశారు. అనంతరం నగదు, నగలు, మొబైల్ ఫోన్లతో పరారయ్యారు. ఆస్తమా, గుండె నొప్పితో బాధపడుతున్న అగర్వాల్ ముఖానికి ప్లాస్టర్ వేయడంతో ఆయన ఊపిరి ఆడక మృతి చెందారు.

అయితే ఇది నిజంగా దొంగల పనేనా.? లేక వీరి గురించి పూర్తి సమాచారం తెలిసిన వ్యక్తులు ప్రమేయం వుందా.? అన్న కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగిన తీరును పరిశీలిస్తే  ఇధి తెలిసిన వారి పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. వెనక నుంచి దొంగలు వచ్చినట్టు చెబుతుండగా తలుపులు విరగ్గొట్టిన దాఖలాలు కనబడటం లేదు. వృద్ద దంపతులు తలుపులు వేయడం మర్చిపోయి పడుకున్నారా? లేక పగలే ఎవరైనా వచ్చి లోపల దాక్కున్నారా? అనేది తెలియడం లేదు. ఇక దొంగలు తమకు ఇంటిలో అంతా తెలిసినట్టుగా నేరుగా బీరువా వద్దకు వెళ్లి అందులోని డబ్బు, నగలను తీసుకెళ్లడం కూడా అనుమానాలను మరింత బలపరుస్తోంది.

దీనికి తోడు ఇంటిలో వున్న వృద్దురాలు మెడలో ఉన్న బంగారు నగలు, చేతికి ఉన్న గాజులను దుండగులు ముట్టుకోలేదు. అంటే ఇది వారికి బాగా తెలిసిన వ్యక్తుల పనే అయివుంటుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. పోలీసులు కూడా ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. అయితే దొంగలు వచ్చిన మార్గాలను ఆయా పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు పోలీసులు. అసలు ఇంతకీ ఈ విషయం పోలీసులకు ఎలా చేరిందంటే..  దొంగతనం చేసిన తరువాత వారు వెళ్లిన విషయాన్ని గమనించిన వృద్దురాలు పడక గదిలో నుంచి వంట గదిలోకి పాక్కుంటూ వచ్చింది.

తన చేతికి దొంగలు కట్టిన తాళ్లను కోసి వేసి బయటకు పరిగెత్తి వెళ్లి సమీపంలోనే ఉండే వైద్యుడు డాక్టర్ ఆదానికి విషయం చెప్పారు. ఆయన వెంటనే బాధితుల కుమారులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అందరూ ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆయన మరణించాడన్న వార్త తెలిసి ఆ కుటుంబసభ్యులు విషాదంలో మునిగారు. నోటితో పాటు ముక్కుకు కూడా ప్లాస్టర్ వేయడంతో.. ఆస్తమా బాధితుడైన రాజేంద్రప్రసాద్ మరణించి ఉంటాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లేదా ప్లాస్టర్ వేసే క్రమంలో దిండుతో ముఖాన్ని అదిమి పెట్టడం వల్లే ఆయన మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajendra prasad agarwal  taramani  deepak  rohit  sirimalle colony  hyderabad police  robbery  crime  

Other Articles