Kerala CM Vijayan calls 'worst flood in 100 years' కేరళలో జలప్రళయం.. 324కు చేరిన మృతుల సంఖ్య..

Kerala death toll rises to 324 cm calls worst flood in 100 years

floods in kerala, heavy rain in kerala, kerala floods, kerala rains, Pinarayi Vijayan, worst floods in 100 years, narendra modi, periyar river, unprecedented rainfall, Trichur, Aluva, Muvattupuzha, Cochin International Airport, K J Alphons, Onam festival

Kerala floods: 324 people dead, CM Vijayan calls it the 'worst flood in 100 years'. PM Modi to undertake an aerial survey of the flood ravaged areas on Saturday.

కేరళలో జలప్రళయం.. 324కు చేరిన మృతుల సంఖ్య..

Posted: 08/17/2018 06:55 PM IST
Kerala death toll rises to 324 cm calls worst flood in 100 years

దేవుడి సొంత రాష్ట్రంపై వరుణుడు పగబట్టాడా.? ఈ నెల 8 నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో మొత్తంగా 14 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అయినా వరుణుడు మాత్రం శాంతించడం లేదు. మరో రెండు మూడు రోజుల పాటు వర్షం కురుస్తుందన్న భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలతో కేరళ రాష్ట్రవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే రెండు మూడు తరాలు చూడని జలవిళయాన్ని కనబరుస్తున్న వరుణుడు.. ఎందుకిలా తమపై పగబట్టాడని ప్రశ్నిస్తున్నారు. తాజాగా అందిన సమాచారం మేరకు కేరళలో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్యల 324కు చేరింది.

గత వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో కేరళ రాష్ట్రంలో వర్షాలు విలయతాండవం చేస్తున్నాయని.. వీటి ఫలితంగా ఏర్పడిన వరదలు వందేళ్లుగా తాము కనివినీ ఎరుగమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అందోళన వ్యక్తం చేశారు. గత తొమ్మిది రోజులుగా ముంచెత్తుతున్న వర్షాలు, విరుచుకుపడుతున్న వరదలు, విరిగి పడుతున్న కొండ చరియలతో మృతిచెందిన వారి సంఖ్య 324కు చేరిందని.. ఒక్క బుధవారం రోజునే 100 మంది మృత్యువాత పడినట్టు కేరళ ముఖ్యమంత్రి తెలిపారు.
 
రాష్ట్రాన్ని అతలాకుతులం చేస్తున్న వర్షాలు, ముంచుకొస్తున్న ప్రమాదంపై తాజా వర్ష సూచనలు, హెచ్చరికలు జారీ చేశామన్నారు. 2 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని, రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో పడిందని చెప్పారు. సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని, అయితే మరింతగా కేంద్ర సాయం కావాలని తాను ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారని తెలిపారు. ఇవాళ కేరళకు రానున్న ప్రధాని మోదీకి పరిస్థితిని వివరిస్తానని చెప్పారు. రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ తో ఇవాళ ఉదయం మాట్లాడానని, మరిన్ని హెలికాఫ్టర్లు కోరానని తెలిపారు.

కేరళలోని వర్ష ప్రభావిత 14 జిల్లాల్లోని పలు గ్రామీణ ప్రాంతాల్లో వరదల్లో చిక్కకున్న వారిని రక్షించేందుకు ఎయిర్ లిఫ్టింగ్ తప్ప మరో మార్గం లేదని తెలిపారు. అనేక మందిని ముంపు ప్రాంతాల నుంచి రక్షించినా ఇంకా వేలాది మంది ముంపు ప్రాంతాల్లో సహాయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. తీవ్రంగా దెబ్బతిన వరద ప్రాంతాలకు మరో 11 హెలికాప్టర్లు పంపుతున్నామని సీఎం తెలిపారు. కాగా, అళపుజ, ఎర్నాకుళం, త్రిసూర్, పథనాంతిట్ట ప్రాంతాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఆ ప్రాంతాలన్నీ ముంపులో చిక్కుకున్నాయి. త్రిసూర్, చాలకుడి పట్టణాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. సహాయ శిబిరాల్లోకి కూడా నీరు వచ్చిచేరుతోంది.
 
అపార నష్టం..

గత వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో కేరళ రాష్ట్రం వరదల్లో చిక్కుకోవడంతో.. కేరళలో అపార నష్టం వాటిల్లింది. ఇంకా వరుణుడి తన ప్రకోపాన్ని చాటుతున్న క్రమంలో నష్టం విలువను కూడా అంచనా వేయలేకపోతున్నారు అధికారులు. తాజాగా అందిన సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 324కు చేరింది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అనేక ఇళ్లు నెలమట్టం కాగా, కొన్ని మాత్రం పాక్షికంగా ధెబ్బతిన్నాయని తెలిపారు. అయితే తాము సర్వం కోల్పోయామని నిరాశ్రయులు అందోళన చెందుతున్నారు. కాగా, 2,23,139 మంది ప్రజలు 1500కు పైగా శిబిరాల్లో తలదాచుకుంటున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ట్వీట్‌లో తెలిపింది. 30 బ్రిడ్జిలు కూలిపోయాయని, లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిందని అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles