MP: Picnic turns tragic at Shivpuri waterfall విహారయాత్రలో విషాదం.. 11 మంది గల్లంతు..

11 swept away while bathing in waterfall in mp s shivpuri 45 rescued

Independence Day,Madhya Pradesh,Madhya Pradesh police,National Disaster Response Force,NDRF,NewsTracker,Shivpuri,Shivpuri district,Shivraj Singh Chouhan,Sultangarh waterfall, madhya pradesh shivpuri, drown, waterfall, Shivraj singh chauhan, rajnath singh

At least 11 people were swept away while 45 have been rescued from Sultangarh Waterfall in Shivpuri district of Madhya Pradesh.

ITEMVIDEOS: విహారయాత్రలో విషాదం.. చూస్తుండగానే గల్లంతు..

Posted: 08/16/2018 06:58 PM IST
11 swept away while bathing in waterfall in mp s shivpuri 45 rescued

మధ్యప్రదేశ్‌ గ్వాలియర్ లో సరదాగా జరగాల్సిన విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని శివపురి జిల్లాలోని సుల్తాన్‌ ఘర్‌ జలపాతాల్లో సరదాగా వెళ్లిన పలువురు నీటి ఉధృతి కారణంగా కొట్టుకుపోయారు. 100 అడుగుల ఎత్తులో వున్న డ్యామ్‌ నుండి ఒక్కసారిగా నీటిని దిగువకు వదలడంతో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. అయితే ఈ అకస్మిక వరదనీటిలో చిక్కుకున్న 45 మందిని రక్షించినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

సెలవు రోజు కావడంతో పదుల సంఖ్యలో అక్కడికి యువత చేరుకుంది. జలపాతం వద్ద వారంతా ఆనందంగా గడుపుతున్న వేళ, ఎగువ నుంచి ఒక్కసారిగా వరద ముంచెత్తింది. నీటిని చూసి భయంతో 30 మంది ఓ రాతి పై భాగాన చిక్కుకుపోగా, మరో 12 మంది ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నీటిలోనే నిలబడ్డారు. క్షణాల్లో వరద ఉద్ధృతి పెరగడంతో వీరంతా జలపాతంలో పడిపోయారు. రాతిపై చిక్కుకున్న వారిలో 8 మందిని రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో కాపాడారు. మిగతావారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

గల్లంతైన 12 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి. పోలీస్‌ సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ.. తాము 40 మందిని రక్షించగా, ఐదుగురిని హెలికాఫ్టర్‌ సహాయంతో రక్షించామని తెలిపారు. వారిని రక్షించినందుకు పోలీసు యంత్రాంగాన్ని మధ్యప్రదేశ్‌ మంత్రి యశోదరా రాజే సింథియా అభినందించారు. అవసరమైన సహాయచర్యలు చేపట్టడానికి సిద్దంగా ఉన్నామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు హామీనిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles