Death toll in devastating Kerala floods rises to 87 కేరళ కాకావికళం..దేవుడి సొంత రాష్ట్రంలో ప్రళయం

Kerala floods landslides as dams burst in india death toll reaches 87

Kerala Floods, Palakkad district, Thrissur district, pinarayi vijayan, Narendra Modi, Idukki district, Rahul Gandhi, appeals-people, contribute, CM's-relief-fund, crime

KERALA has been hit by devastating flash floods amid landslides and fears a dam could burst its banks in the heavy rains. Here is the latest news and live updates on the Kerala flooding.

కేరళ కాకావికళం..దేవుడి సొంత రాష్ట్రంలో ప్రళయం

Posted: 08/16/2018 06:33 PM IST
Kerala floods landslides as dams burst in india death toll reaches 87

దేవుడి సొంతరాష్ట్రంగా ఖ్యాతి గడించిన కేరళపై ప్రకృతి ప్రళయకార రూపాన్ని ఎత్తి.. రాష్ట్రంలోని ఏకంగా 14 జిల్లాలలో అత్యవసర పరిస్థితిని నెలకొల్పేలా చేసింది. కేరళా వ్యాప్తంగా వరుణుడి ప్రకోపానికి గురైందా.. అన్నట్లుగా ఎక్కడ చూసినా జలమే తప్ప.. నేల కనిపించకుండా పోయింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్సాలనికి కేరళలోని అనేక ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్థంబించింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో వరద విలయతాండవం చేస్తోంది.

పటనమ్హిట్ట ప్రాంతం పూర్తిగా వరదనీటితో మునిగిపోయింది. ఇదిలా ఉంటే సహాయకచర్యలకు వర్షం అడ్డంకి సృష్టిస్తున్నప్పటికీ... త్రివిధ దళాలు, ఎన్డీఆనర్ఎఫ్ బృందాలు తమ సహాయకచర్యలను కొనసాగిస్తున్నారు. స్థానిక ప్రజలు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు వరదల కారణంగా కేరళలో 67 మంది మృతి చెందినట్లు సమాచారం.

దక్షిణ నావికాదళం కమాండ్ తన కార్యక్రమాలన్నిటినీ వాయిదా వేసుకుని అక్కడి అధికారులను కేరళ సహాయకచర్యల్లో పాల్గొనాలని ఆదేశించింది. వరదల నుంచి ప్రజలను కాపాడాలని దక్షిణ నావల్ కమాండ్‌ను ఆ రాష్ట్ర సీఎం పినరాయి విజయన్ కోరారు. వరదలకు బాగా దెబ్బతిన్న ఎర్నాకులం త్రిచూర్ ప్రాంతాల్లో నేవల్ కమాండ్ సహాయక చర్యల్లో పాల్గొంటోంది. రాత్రికి రాత్రే చాలామందిని హెలికాఫ్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత వందేళ్లలో ఎన్నడూ ఈ స్థాయిలో వరదలు కేరళలో రాలేదు.

కేరళకు కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో చాలా మటుకు రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. ఈ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ చెబుతోంది. కొన్ని మెట్రో పరిసర ప్రాంతాలోకి భారీగా నీరు వచ్చి చేరడంతో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. బుధవారం కొచ్చి ఎయిర్‌పోర్టును మూసివేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు... ఆగష్టు 18వరకు ఎయిర్ పోర్టు మూసే ఉంటుందన్నారు. దీంతో కొచ్చికి వచ్చే అంతర్జాతీయ విమానాలను తిరువనంతపురం, ముంబైలకు మళ్లించారు.

వరద కారణంగా పలు జాతీయ రహదారులు దెబ్బతినడంతో బస్సులు కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సీఎం పినరాయి విజయన్ తో వరద పరిస్థితిపై మాట్లాడినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. కేరళలో సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా రక్షణశాఖను ఆదేశించినట్లు ప్రధాని వెల్లడించారు. ఈ సమయంలో కేరళ ప్రజలు ధైర్యంగా ఉండాలని వారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

కేరళకు అవసరమైన సహాయమందించాలని ప్రధాని మోడీతో చర్చించానని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ పేర్కొన్నారు. ఈ శతాబ్దపు అధ్వాన వర్షాకాలమని అన్నారు. 'కేరళ బాధలో ఉంది. సహాయ చర్యల నిమిత్తం ఆర్మీ, నావికా దళాలను మరింత పెంచాలని మోడీని కోరాను. కేరళ చరిత్రలోనే 'ఇంతకు ముందు చూడనటువంటి విషాదం' నెలకొనడంతో రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరానని' రాహుల్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.కేరళలో వరద పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అక్కడి ప్రజలకు సహాయాన్ని అందించడానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి తోడ్పడాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి చెందిన లింక్‌ను టాగ్‌ చేశారు. ఇది సహాయం చేసే సమయం అని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Kerala-floods  appeals-people  contribute  CM's-relief-fund  crime  

Other Articles