Karunanidhi's health condition deteriorates further కరుణానిధి అరోగ్యం మరింత విషమం..

Dmk chief karunanidhi s health condition deteriorates further kauvery hospital doctors say

M Karunanidhi, Kauvery Hospital, Kalaignar, dmk, stalin, CM Palanisamy, Health condition, karunanidhi latest news, tamil nadu

DMK president M Karunanidhi’s health condition has deteriorated further, doctors treating him in Kauvery Hospital here said on Tuesday.

కరుణానిధి అరోగ్యం మరింత విషమం.. సీఎంతో స్టాలిన్ భేటీ.?

Posted: 08/07/2018 05:10 PM IST
Dmk chief karunanidhi s health condition deteriorates further kauvery hospital doctors say

అనారోగ్యంతో కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే కురువృద్ధుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్య మరింతగా క్షీణించింది. ఈ వార్త తెలియడంతో రాష్ట్రం నలుమూలల నుంచి ఆయన అభిమానులు, డీఎంకే పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాజధాని చెన్నైలోని కావేరి అసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆయన ఆరోగ్యంగా తిరిగిరావాలని ప్రార్థనలు చేస్తున్నారు. అయితే కరుణానిధి కోసం వస్తున్న కార్యకర్తలు అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వారిని అదుపు చేసేందుకు సుమారు 500 మంది పోలీసులు మోహరించారు. ఆస్పత్రి బయట ఉద్విగ్న, ఉద్రిక్త, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

కాగా వారం రోజుల క్రితం విషమించిన కరుణానిధి అరోగ్యం కోలుకున్న తరువాత.. రెండు రోజుల క్రితం ఆయన అరోగ్యం విషమించింది. డాక్టర్లు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నా.. వయోభారం వల్ల కరుణానిధి శరీరంలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదని వైద్యులు తెలిపారు. 24 గంటలు గడిస్తే కానీ ఆయన అరోగ్యం విషయంలో ఏమీ చెప్పలేమని చెప్పిన వైద్యులు.. కరుణానిధి ఆరోగ్యం విషయంలో ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ ను విడుదల చేసే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కరుణానిధి తనయుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నివాసానికి వెళ్లారు. ఆయనతో పాటు డీఎంకేకు చెందిన మరో ముగ్గురు సీనియర్‌ నేతలు కూడా వెళ్లి సీఎంను కలిశారు. కరుణానిధి ఆరోగ్యం గురించి, ఆయనకు అందిస్తున్న చికిత్స గురించి సీఎంకు వివరించారు. గత రెండు రోజులుగా కరుణానిధి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం.. ఈనేపథ్యంలో సీఎంతో స్టాలిన్‌ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles