NCBC granted constitutional status by parliament బీసీ కోసం జాతీయ కమిషన్.. సవరణ బిల్లుకు పచ్చజెండా

Parliament passes bill giving constitutional status to ncbc

Rajya Sabha, Lok sabha, parliament, OBC Commission, National Commission for Backward Classes, NCBC, Constitutional status, statutory powers, PM Modi

The Constitution (123rd Amendment) Bill, which gives the National Commission for Backward Classes statutory powers, was unanimously passed by the Rajya Sabha

బీసీ కోసం జాతీయ కమిషన్.. సవరణ బిల్లుకు పచ్చజెండా

Posted: 08/07/2018 11:44 AM IST
Parliament passes bill giving constitutional status to ncbc

వెనుకబడిన తరగతుల జాబితాలో వున్న కులాలకు జాతీయ కమిషన్ (ఎన్సీబీసీ) ఏర్పాటుకు మార్గం ఏర్పడింది. ఎన్సీబిసీకి రాజ్యాంగ హోదాను కల్పించే 123వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు అమోదం లభించింది. గత ఏడాది ఈ బిల్లును ప్రవేశపెట్టి చేతులు కాల్చుకున్న అధికార పార్టీ.. ఈ సారి రాజ్యసభలోనూ తమకు మోజారిటీ వున్న కారణంతో పాటు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించి.. ఏకగ్రీవంగా అమోదింపజేసుకుంది. ఇప్పటికే ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఇప్పుడు పెద్దలసభ కూడా ఆమోదించడంతో బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించినట్టయింది.

తాజా బిల్లు ప్రకారం వెనుకబడిన తరగతుల వారిని చేర్చడం, లేదా తొలగించాలనే అభ్యర్థలను పరిశీలించడం, ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సూచనలిచ్చే అధికారం నేషనల్ కమిషన్‌కు లభిస్తుంది. గత మంగళవారంనాడే లోక్‌సభలో ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. సభకు హాజరైన వారంతా బిల్లుకు అనూకూలంగా ఓటేయడంతో మూడింట రెండొంతులకు పైగా మెజారిటీతో బిల్లుకు ఆమోదం లభించింది. అయితే ఈ కమీషన్ లో సభ్యురాలిగా ప్రతిపక్ష పార్టీలకు మహిళా ఎంపీకి స్థానం కల్పిస్తామని సవరణ చేయడంతో ఈ బిల్లు రాజ్యసభలో ఏకగ్రీవంగా అమోదం పోందింది.

కాగా ఈ కమీషన్ లో మైనారిటీకి చెందిన వారు కూడా సభ్యులుగా వుండాలన్న షరతును విధించిన ప్రతిపక్షాలు ఆ డిమాండ్ ను ఉపసంహరించుకోవడంతో.. బిల్లుకు పార్లమెంటు అమోదం లభించింది. దీంతో బీసిల సంక్షేమానికి మోదీ సర్కార్‌ కట్టుబడిందనే సంకేతాలను పంపుతూ ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) ప్రయోజనాలను పరిరక్షించేలా, వారి హక్కులను కాపాడేందుకు పూర్తి అధికారాలను ఎన్‌సీబీసీకి కట్టబెడుతూ దానికి రాజ్యాంగ హోదా కల్పించే బిల్లును ఆమోదింపచేయడం ప్రభుత్వ విజయంగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ బిల్లుకు రాజ్య‌స‌భ‌లో ఆమోదం ల‌భించ‌డంపై బీజేపీ అధ్య‌క్షుడు అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajya Sabha  parliament  OBC Commission  NCBC  Constitutional status  PM Modi  

Other Articles