congress committed to AP development: Tulasi Reddy కేంద్రం విధిల్చింది ఎంగిలి మెతుకులే: తులసిరెడ్డి

Congress committed to andhra pradesh development tulasi reddy

AP Congress, Tulasi Reddy, APCC, AP developments, AP Funds, PM Modi, BJP, Chandrababu Naidu, YS Jagan, BJP, UPA, NDA, politics

APCC vice-president N Tulasi Reddy slammed NDA government, AP Government and Opposition party in the state for tha lagging process in developing Andhra Pradesh.

కేంద్రం విధిల్చింది ఎంగిలి మెతుకులే: తులసిరెడ్డి

Posted: 08/06/2018 04:04 PM IST
Congress committed to andhra pradesh development tulasi reddy

కేంద్ర ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఇవ్వాల్సింది కొండంత అయితే, ఇచ్చింది మాత్రం గోరంత అని ఏపీసీసీ ఉపాధ్య‌క్షుడు ఎన్‌.తుల‌సిరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. ప్రధాని నరేంద్ర మోది మోస‌గారి త‌నం, ముఖ్యమంత్రి చంద్ర‌బాబు చేత‌గాని త‌నం, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అవ‌కాశ‌వాదం వ‌ల్ల అప్పటి యూపీఏ ప్రభుత్వం కల్పించిన అనేక ప్రయోజనాలలో కొన్ని అసలు అమ‌లుకు నోచుకోలేదని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు, అయితే కొన్నింటికి మాత్రం పిల్లికి భిక్షం వేసిన‌ట్లు, మ‌రికొన్నింటిలో ఎంగిలి మెతుకులు విదిల్చిన‌ట్లు కేంద్రం నిధులు విడుద‌ల చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐదవ సంవత్సరం రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్ల రూపాయలను ఇవ్వాల్సిన కేంద్రం కేవలం రూ.12 వేల కోట్లను మాత్రమే విధిల్చిందని అయన అక్రోశాన్ని వెళ్లగక్కారు. దీంతో అర్థిక ఇబ్బంధులను ఎదుర్కొంటున్న రాష్ట్రానికి మరిన్నీ సమస్యలు అధికమయ్యాయని తెలిపారు. దీనికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజీపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీతో పాటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన జ‌గ‌న్ పార్టీ కార‌ణ‌మ‌ని ఆయ‌న ఆరోపించారు. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేసేందుకు యూపీఏ ప్రభుత్వం కల్పించిన అనేక ప్రయోజనాలు కేవలం కాయితాల్లోనే వున్నాయని అయన అవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వం కల్పించిన ప్ర‌యోజ‌నాలు అమలు కావాలంటే.. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. యూపీఏ క‌ల్పించిన హామీలు అమలై వుంటే సీమాంధ్ర స్వ‌ర్ణాంధ్ర అయ్యి ఉండేదని తెలిపారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావ‌డంతో అవి అమ‌లుకు నోచుకోలేదని విమర్శించారు. 2019లో కాంగ్రెస్ ని గెలిపించాలని, అధికారంలోకి రాగానే ప్ర‌త్యేక‌హోదా అమ‌లుతో పాటు చ‌ట్టంలో పేర్కొన్న అన్ని అంశాలు త్వ‌రిత‌గ‌తిన అమ‌లు చేస్తామ‌ని తుల‌సిరెడ్డి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Congress  Tulasi Reddy  APCC  AP developments  AP Funds  PM Modi  BJP  Chandrababu Naidu  YS Jagan  BJP  UPA  NDA  politics  

Other Articles