TDP demands release of funds for Andhra Pradesh లోక్ సభ నుంచి టీడీపీ ఎంపీల వాకౌట్.. నిరసన

Tdp demands release of funds for andhra pradesh in lok sabha

Andhra Pradesh, Congress, Lok Sabha, Chandrababu naidu, Ram Mohan Naidu, Murali Mohan, Shiv Sena, Sumitra Mahajan, TDP

TDP members on Monday brought placards in the Lok Sabha to protest the Centre's alleged withdrawal of funds for Andhra Pradesh and demanded the Union government immediately release them.

లోక్ సభ నుంచి టీడీపీ ఎంపీల వాకౌట్.. నిరసన

Posted: 08/06/2018 06:22 PM IST
Tdp demands release of funds for andhra pradesh in lok sabha

ఆంధ్రప్రదేశ్ లోని వెనుకబడిన జిల్లాలకు ఇచ్చినట్టే ఇచ్చిన నిధులను మళ్లీ వెనక్కి తీసుకోవడంపై టీడీపీ పార్లమెంటు సభ్యులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను మళ్లీ వెనక్కి తీసుకోవడం ఏంటని లోక్ సభలో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం చర్యకు నిరసనగా లోక్ సభ నుంచి టీడీపీ ఎంపీలు వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, జేసీ దివాకర్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మురళీమోహన్ లు మీడియాతో మాట్లాడారు.

వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రల నుంచి వెళ్లిన నిధులనే కేంద్రం పలు విధాలుగా రాష్ట్రాలకు ఇస్తుందని, అలాంటిది.. అంధ్రప్రదేశ్ పై మాత్రం కేంద్రం ఎందుకు వివక్ష చూపుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. మనస్సులో ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పెట్టుకుని పైకి మాత్రం తాము రాష్ట్రానికి స్నేహహస్తాన్ని అందిస్తున్నామని ప్రగల్భాలు పలికుతున్న కేంద్రం.. రాష్ట్ర ప్రజలపై కక్షగట్టిందని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం అంధ్రప్రదేశ్ పై వివక్ష చూపడం మానుకోవాలని వారు విన్నవించారు.

 95 శాతం యూసీలు ఇచ్చినా కేంద్రం నిధులు ఇవ్వకపోవడం కక్ష సాధింపు చర్యేనని అన్నారు. ఫిబ్రవరి 9న వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు విడుదల చేశారని, వారం రోజుల్లోగా పీఎంవో చెప్పిందంటూ వెనక్కి తీసుకున్నారని, ఏపీపై వివక్ష చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. యూసీలు అందించడంలో దేశంలోనే ఏపీ 3వ స్థానంలో ఉందని, యూసీలు ఇవ్వడం లేదని ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఏపీకి బుందేల్ ఖండ్ తరహాలో ప్యాకేజ్ అమలు చేస్తామన్నారని, అది అమలు చేస్తే రూ.22 వేల కోట్లు విడుదల చేయాలని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles