Three arrested for assaulting Muslim youth in Haryana ముస్లిం యువకుడిపై దాడి.. గడ్డం గీయించి అవమానం

Three arrested for assaulting muslim youth in haryana

Three arrested for assaulting muslim youth, Jaffruddin, Khandsa Mandi, Gurgaon, Gurugram, Muslim youth, Gaurav, Eklash, Nitin, chop his beard off, uttar pradesh, religious insults, sector 37 Police Station, Haryana, crime

In a shocking incident, three persons allegedly assaulted, abused and chopped off a Muslim youth's beard at sector-37 of Haryana's Gurugram. The accused were identified as Gaurav, Eklash from Uttar Pradesh and Nitin from Haryana.

ముస్లిం యువకుడి గడ్డం గీయించి దాడి చేసిన ముగ్గురి అరెస్టు

Posted: 08/03/2018 12:50 PM IST
Three arrested for assaulting muslim youth in haryana

హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా బిన్నత్వంలో ఏకత్వాన్ని చవిచూస్తు అత్యంత పెద్ద ప్రజాస్వామ్య, లౌకిక దేశంగా బాసిల్లుతున్న భారతావనిలో.. హిందూ, ముస్లిం బాయ్.. భాయ్.. అనే రోజులు పోయి.. వీడు ముస్లిం.. వీడు హిందూ అనే రోజులు వస్తున్నాయా..? అన్నట్లుగా అందోళన కలిగించే ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ఓ ముస్లిం యువకుడ్ని మతం పేరుతో తీవ్రంగా దూషించిన ముగ్గురు దుండగులు.. అతను ఎదురు తిరగడంతో దాడి చేసి.. బలవంతంగా సెలూన్ కు లాక్కెళ్లి గడ్డాన్ని తీయించారు. గత నెల 31న ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హర్యానాలోని మేవాట్ లో ఉంటున్న జఫ్రుద్దీన్ తన స్నేహితుడిని కలుసుకునేందుకు గురుగ్రామ్ కు వచ్చాడు. ఈ సందర్భంగా ఖాన్సా మండీ ప్రాంతంలో కొందరు దుండగులు జఫ్రుద్దీన్ ను మతం పేరుతో దూషించడం మొదలుపెట్టారు. అయినా జఫ్రుద్దీన్ పట్టించుకోలేదు. చివరికి వేధింపులు మరింత ఎక్కువ కావడంతో దుండగులకు, జఫ్రుద్దీన్ కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో జఫ్రుద్దీన్ పై దాడికి పాల్పడ్డ నిందితులు.. సమీపంలోని సెలూన్ కు లాక్కెళ్లి బలవంతంగా అతని గడ్డం తీయించారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించినా.. తన మనోభావాలు గాయపడ్డాయని, నన్ను తిట్టినా పడే వాడిని.. నా దేవుడిని దూషించి.. అల్లా కోసం పెంచుతున్న నా గడ్డాన్ని కూడా తీయించడంతో పరాభావానికి గురైన జాఫ్రుద్దీన్ తాను పోలీసులకు తప్పకుండా పిర్యాదు చేస్తానని మరీ వార్నింగ్ ఇచ్చాడు. అన్నట్లుగానే మరుసటి రోజు ఉదయాన్నే తమ కుటుంబసభ్యులతో కలసి సెక్టార్ 37 పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన గౌరవ్, ఏకలాస్ తో పాటుగా హర్యానాకు చెందిన నితిన్ అనే నిందితుడిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. అయితే కేవలం ఇది అకతాయిల పనే తప్ప.. వీరి వెనుక ఏ మత సంస్థలు లేవని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jaffruddin  Khandsa Mandi  Muslim youth  religious insults  sector 37 Police Station  Haryana  crime  

Other Articles