CM Proposes Declaring Belagavi As Second Capital ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను చల్లార్చేందుకు సీఎం వ్యూహం..

Cm proposes declaring belagavi as second capital to rein in separate state demand

North Karnataka, Bandh, Separate State, Uttara Karnataka Horata Samiti (UKHS), Belagavi, Second Capital, siddaramaiah, shiva kumar, yeddurappa, karnataka, politics

Amid growing protests in the North Karnataka over ‘step-motherly’ treatment being meted out to the region by the JD(S)-Congress government in the state, Chief Minister (CM) H D Kumaraswamy has proposed declaring Belagavi as the second capital of Karnataka.

ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను చల్లార్చేందుకు సీఎం వ్యూహం..

Posted: 08/01/2018 03:39 PM IST
Cm proposes declaring belagavi as second capital to rein in separate state demand

ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని నిరసనలు మిన్నంటుతున్న వేళ.. ఆ డిమాండ్ ను చల్లార్చేందుకు ముఖ్యమంత్రి తన వ్యూహాలకు పదనుపెట్టారు. ఇప్పటికే తాను చేసిన వ్యాక్యలు అఖండ కర్ణాటక సమైఖ్యతకు విఘాతం కలిగించేవిలా వున్నాయని.. ప్రధాన ప్రతిపక్షం బీజేపి విమర్శలు చేస్తున్న క్రమంలో నష్టనివారణా చర్యలకు కుమారస్వామి పూనుకున్నారు. ఉత్తర కర్ణాటకలోని ప్రధాన పట్టణమైన బెళగావిని రెండో రాజధానిగా ప్రకటించాలని ఆయన ప్రతిపాదించారు. బెళగావిలో ఉన్న సెక్రటేరియేట్ భవనం 'సువర్ణ విధాన సౌధా' లోకి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.

కాగా, జేడీ(ఎస్) - బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2006లోనే, బెళగావిని రెండో రాజధానిగా చేయడానికి ఏకగ్రీవ తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో నాగపూర్, జమ్మూ కాశ్మీర్ లో జమ్మూ మాదిరిగా కన్నడ నాట కూడా రెండు రాజధానుల ఏర్పాటుకు అడుగులు పడ్డా, అవి పన్నెండేళ్లుగా దస్త్రాలకే పరిమితమయ్యాయి. ఇటీవల బెల్గాం ప్రాంతం కర్ణాటకలో భాగమేనని మహాజన్ కమిషన్ రిపోర్టు ఇవ్వడంతో, దాన్ని అమలు చేసే దిశగా కుమారస్వామి ఇప్పుడు అడుగులు వేస్తున్నారు.

"నేను 2006లో సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ డిమాండ్ పెండింగ్ లో ఉంది. ఆ తరువాతి ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనలను పక్కనబెట్టాయి. బెళగావిని రెండో రాజధానిగా ప్రకటించే అంశంపై నేను ఆలోచిస్తున్నా. ఈ విషయమై సాధ్యమైనంత త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం" అని కుమారస్వామి వెల్లడించారు. కాలాబుర్గి, బెళగావి, హుబ్లీ-ధార్వాడ్ ప్రాంత ప్రజలు ప్రతి విషయానికీ సుదూరంలో ఉన్న బెంగళూరుకు రావడం కష్టమనే విషయాన్ని తాము గుర్తించామని కుమారస్వామి వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles