Man live streams suicide on Facebook ఫేస్ బుక్ లైవ్ లో వ్యక్తి బలవన్మరణం.. చోద్యం చూసిన జనం..

2 300 view man suicide video live on facebook no one calls cops

Gurugram Man, Gurugram Suicide, Amit Chauhan, Amit Chauhan Facebook, Facebook Live, Live News, suicide, Share, man, Father, family, Facebook. police, crime

Police said around 2,300 people had watched the live streaming on facebook but none raised an alarm, alerted cops, while thier friend was commiting suicide

ఫేస్ బుక్ లైవ్ లో వ్యక్తి బలవన్మరణం.. చోద్యం చూసిన జనం..

Posted: 08/01/2018 02:52 PM IST
2 300 view man suicide video live on facebook no one calls cops

మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు.. అంటూ గాయకులు ఎన్ని పాటలను అలపించినా.. నిజంగా మనిషన్నవాడు మాత్రం మార్పుకే ఓటువేస్తూ అటువైపుకే పయనాన్ని లాగిస్తున్నాడు. సాంకేతిక విప్లవంతో ప్రతీ ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చి చేరగానే.. పనిపాట లేని వాడు కూడా ఎంతో పనివున్నవాడిలో అందులోనే జీవించేస్తున్నాడు. ఇలాంటి తరుణంలో అదే సోషల్ మీడియాలో లైవ్ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడిన ఓ వ్యక్తి.. వీడియోను అతని గ్రూపులోని 2300 మంది వీక్షించినా.. వారిలో ఒకరు కూడా కనీసం పోలీసులకో, వారి కుటుంబసభ్యులకో సమాచారం మాత్రం ఇవ్వలేదు.

వివరాల్లోకి వెళ్తే.. గుర్గావ్‌కు సమీపంలోని జతోలికి చెందిన అమిత్ చౌహాన్ సోమవారం సాయంత్రం 7.10 నిమిషాల సమయంలో ఫేస్‌బుక్ లైవ్ ఆన్ చేశాడు. తాను చనిపోతున్నానని.. ఈ వీడియోనూ షేర్ చేయాలని చెప్పాడు. లైవ్ స్ట్రీమ్‌లోనే ఫ్యాన్‌కు చున్నీ కట్టి.. ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. దాదాపు రెండు గంటల పాటూ ఈ లైవ్ అలాగే కొనసాగింది. 2వేలమందికిపైగా ఈ వీడియోనుచూశారు. తర్వాత అతడి భార్య వచ్చి చూసేదాక ఆత్మహత్య చేసుకున్న విషయం బయటపడలేదు.

చౌహాన్ ఆత్మహత్య విషయాన్ని కుటుంబ సభ్యులు బయటకు రానివ్వలేదు. అతడి అంత్యక్రియలు కూడా వెంటనే పూర్తి చేశారు. కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం అందరికి తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆత్మహత్యకు కారణాలను ఆరా తీశారు. కుటుంబ కలహాల వల్లే చౌహాన్ ప్రాణాలు తీసుకున్నాడట. ఘటనకు అరగంట ముందే భార్యతో గొడవపడగా.. కొద్దిసేపటి తర్వాత ఆమె ఇద్దరు పిల్లల్ని తీసుకొని పొరుగింటికి వెళ్లింది. ఆమె తిరిగి ఇంటికి వచ్చేలోపే అతడు ఉరి వేసుకున్నాడు.

కుటుంబ కలహాలు మాత్రమే కాదు.. చౌహాన్ మానసిక స్థితి కూడా సరిగా లేదంటున్నాడు అతడి తండ్రి. భార్యను కూడా తరచూ కొట్టేవాడని.. చౌహన్‌కు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ కూడా జరుగుతోందన్నాడు. అయితే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా.. అంత్యక్రియలు నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోనే పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amit Chauhan  Gurugram Man  suicide  Share  man  Father  family  Facebook. police  

Other Articles