Mars is closer to Earth than it's been in 15 years ఖగోళంలో అద్భుతం.. భూమికి చేరువగా అంగారకుడు..

Mars makes its closest approach to earth since 2003

Mars, Closest to earth, Mars- Earth Opposition, Mars Closest To Earth, Planet Mars, opposition of mars, earth, bigger mars

A glimple of a brigher Mars tonight as the Red Planet makes its closest approach to Earth in 15 years on Tuesday when the two planets will be 57.6 million kilometres apart.

ఖగోళంలో అద్భుతం.. భూమికి చేరువగా అంగారకుడు..

Posted: 07/31/2018 07:47 PM IST
Mars makes its closest approach to earth since 2003

ఖగోళంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. చంద్రుడికి ఆవల ఉన్న అంగారక గ్రహం ఇవాళ రాత్రికి భూమికి దగ్గరగా రానుంది. సాధారణంగా ఈ గ్రహం మనకు సుదూరంలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ రోజు ఇది మరింత కాంతివంతంగా కనిపిస్తుంది. అయితే, టెలిస్కోప్ ద్వారా దీన్ని వీక్షించవచ్చు. ఇవాళ అంగారక గ్రహం భూమికి 57.6 మిలియన్ కిలోమీటర్ల దూరానికి రానుంది. ప్రస్తుతం అంగారకుడిపై దూళి తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టెలిస్కోప్‌లో అంత స్పష్టంగా కనిపించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భూమికి దగ్గరగా ఉన్న శుక్రుడు ప్రకాశవంతంగా కనిపించనున్న నేపథ్యంలో.. అంగారకుడు మాత్రం అంత కాంతిని వెదజల్లేలేకపోవచ్చునని పరిశోధకులు తెలుపుతున్నారు. అంగారక గ్రహం ఎర్ర రంగులో ఉంటుందని, ఈ నేపథ్యం కాషాయ రంగులో ప్రకాశించే అవకాశం ఉందన్నారు. 2003లో దాదాపు 60 వేల సంవత్సరాల కిందట భూమి, అంగారకుడు అత్యంత సమీపంలోకి వచ్చారని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

అప్పట్లో వీటి మధ్య దూరం దాదాపు 55.7 మిలియన్ కిలోమీటర్లని తెలిపారు. మళ్లీ 2287లో మాత్రమే అంత దగ్గరగా వస్తుందని నాసా పేర్కొంది. అయితే, మళ్లీ 2020వ సంవత్సరంలో 62 మిలియన్ కిలోమీటర్ల దగ్గరకి అంగారకుడు వస్తాడని తెలిపింది. ఈ రోజు అంగారకుడిని చూడటం మిస్సయినా ఫర్వాలేదు. ఆగస్టు నెల మొదటి వారమంతా కనిపిస్తుంది. అయితే, రోజులు పెరిగే కొద్ది క్రమేనా వెనక్కి వెళ్లిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mars  Closest to earth  Mars- Earth Opposition  Mars Closest To Earth  

Other Articles