pawan kalyan on kapu reservation కాపు రిజర్వేషన్లపై టీడీపీ. వైసీపీలది అవకాశవాదమే: పవన్ కల్యాన్

Pawan kalyan critisizes ruling and opposition on kapu reservation

pawan kalyan, janasena, jana sena political affairs committee meet, pawan kalyan on kapu reservation, porata yatra, Pawan Kalyan bus Yatra, pawan kalyan porata yatra, Pawan Kalyan uttatandhra yatra, Pawan Kalyan gangapooja, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief Pawan Kalyan on Kapu Reservations. Power star says that ruling and oppsition parties of the state have been using kapu reservation issue for their political gains treating them as vote bank.

కాపు రిజర్వేషన్లపై టీడీపీ. వైసీపీలది అవకాశవాదమే: పవన్ కల్యాన్

Posted: 07/31/2018 07:59 PM IST
Pawan kalyan critisizes ruling and opposition on kapu reservation

కాపుల రిజర్వేషన్ల అంశాన్ని పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాన్ విమర్శించారు. రిజర్వేషన్ల విషయాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వాడుకొంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే ముఖ్యమంత్రి కూడా కులాల మధ్య చిచ్చు రేపే విధంగా రిజర్వేషన్ల విషయంలో వ్యవహరించడం ఎంతవరకు సముచితమని ప్రశ్నించారు.

ఇక ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా కాపుల రిజర్వేషన్ల అంశంలో ఏడాదికో మాట మార్చడం చూస్తుంటే.. రాజకీయ లబ్ధిని దృష్టిలో ఉంచుకొనే అధికార, విపక్ష పార్టీలు రాజకీయ క్రీడలు ఆడతున్నాయని దుయ్యబట్టారు. నాలుగు దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్, రెండు దశాబ్దాలు పీఠం మీద ఉన్న టీడీపీలకు రిజర్వేషన్లపై  నిశ్చితాభిప్రాయం లేకుండా ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయన్న పవన్ తూర్పారబట్టారు. మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో.. పొలిటికల్ అఫైర్స్ కమిటీ తొలి సమావేశం సందర్భంగా కాపుల రిజర్వేషన్ అంశంపై పవన్ కల్యాన్ స్పందించారు.

ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ, గందరగోళంతో, కులాల మధ్య దూరాలు పెంచి ప్రయోజనాన్ని పొందే పనిలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని, ఈ అంశంపై కూలంకషంగా అధ్యయనం చేసేందుకు నిపుణులతో చర్చించాలని ఆయన నిర్ణయించారు. అర్హులైన వర్గాలన్నింటికీ రాజకీయ ఫలాలు అందాలని చెప్పారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయడం బాధ్యతారాహిత్యమే అవుతుందని అన్నారు. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఆచరణాత్మక విధివిధానాలతో కూడిన నిర్ణయాలు అవసరమని, పాలకులు ఈ విషయంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లోని లోపాల మూలంగా ప్రజల మధ్య అంతరాలు పెరిగే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు.

అనంతరం పార్టీ ముఖ్య నేతలతో పవన్ సమావేశం అయ్యారు. పార్టీపరంగా జిల్లాల్లో చేపడుతున్న కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు ప్రక్రియ, ‘వీర మహిళ’, ‘ఆజాద్ యూత్’ విభాగాల నిర్మాణంపై చర్చించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు. జనసేన మేనిఫెస్టో రూపకల్పన, విద్యార్థి విభాగానికి సంబంధించిన చర్చను రేపు నిర్వహించనున్నారు. ప్రత్యేక హోదా సాధన, భూసేకరణ చట్టం పరిరక్షణ అంశాలపైనా చర్చించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles