Woman Accuses BJP Worker, Driver Of Rape యువతిపై అత్యాచారం.. ఆపై డ్రైవర్ తో బలవంతపు పెళ్లి..

Up woman raped by bjp worker driver forcefully married to latter

BJP worker accused of rape, rape, crime against women, Unnao Rape case, BJP MLA, CBI custody, Kuldeep Sengar, Sitapur jail, Vicky Taneja, Meerut, Uttar Pradesh

A woman has alleged that she was raped by a BJP worker and his driver in Uttar Pradesh's Meerut. The accused BJP worker has been identified as Vicky Taneja and his driver as Jaib.

యువతిపై అత్యాచారం.. ఆపై డ్రైవర్ తో బలవంతపు పెళ్లి..

Posted: 07/30/2018 11:54 AM IST
Up woman raped by bjp worker driver forcefully married to latter

అత్యాచారం కేసులో అధికార పార్టీ బీజేపికి చెందిన ఎమ్మెల్యేకు కూడా కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైన విషయాన్ని ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన నేతలు అప్పుడే మర్చిపోయినట్లు వున్నారు. అధికార పార్టీ మాది.. మేం ఏం చేసినా చెల్లుతుందన్న భావనలో వున్న ఓ నేత.. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి.. అమె పిర్యాదు నేపథ్యంలో తన డ్రైవర్ తో బలవంతపు వివాహం చేయించి.. తన పాపానికి ప్రాయశ్చిత్తం చేయించుకున్నానని భావిస్తున్నాడు. ఆయితే డ్రైవర్ కూడా ఆమెతో ఆరు నెలల పాటు సంసారం చేసి ఆనక వదిలివెళ్లిపోయాడు.

ఇది పథకం ప్రకారం తనపై అధికార పార్టీ బీజేపీకి చెందిన నేత, అతని డ్రైవర్ కలసి ఆడిన నాటకమని, తనపై అత్యాచారం జరిపిన ఇద్దరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత మహిళ పోలీసులను అశ్రయించి పిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే మీరట్ నేత బీజేపి నేత విక్కీ తనేజా, తన డ్రైవర్ జైబ్ తో కలసి తనపై అత్యాచారం చేశారని, కేసు నుంచి తప్పించుకునేందుకు తనకు ఇష్టం లేకపోయినా అతని  డ్రైవర్ జైబ్ తో బలవంతంగా వివాహం జరిపించాడని బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది.

తనేజా తనపై ఏడాది క్రితం అత్యాచారం చేశాడని, దీంతో తాను పోలీసులను ఆశ్రయించానని చెప్పింది. అయితే పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చిన నేత.. రాజీ కుదుర్చుకుంటామని చెప్పి తనను తీసుకెళ్లి.. తన డ్రైవర్ జైబ్ తో ఆమెకు ఇష్టం లేని పెళ్లిని చేయించాడని తెలిపింది. అయితే వివాహం అనంతరం ఆరు నెలల పాటు బాధితురాలితో ఉన్న జైబ్, ఆపై ఆమెను వదిలేసి వెళ్లాడు. దీంతో ఆమె మరోసారి పోలీసులను ఆశ్రయించింది. అత్యాచార కేసుల్లో రాజీలు కుదరవని కచ్చితంగా వారిపై కేసులు నమోదు చేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశించిన నేపథ్యంలో.. తాము చెసిన తప్పు వెలుగులోకి వస్తుందని, పోలీసులు ఈ సారి విక్కీ తనేజా, జైబ్ లపై కేసు నమోదు  చేశారు. కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP leader  gang rape  rape  crime against women  BJP MLA  Vicky Taneja  Meerut  Uttar Pradesh  

Other Articles