DMK chief recovering after sudden setback కోలుకుంటున్న కరుణానిధి..

Dmk chief is better recovering well says tamil nadu cm

karunanidhi health, karunanidhi health news today, karunanidhi health news today tamil, karunanidhi health problems, Tamil Nadu Ministers, DMK Chief Karunanidhi, Karunanidhi condition, DMK, Karunanidhi, Kauvery hospital, Tamil Nadu CM, K palaniswami, chennai

Veteran DMK leader Karunanidhi was shifted to Chennai’s Kauvery Hospital two days ago prior to which he was undergoing treatment for fever due to urinary tract infection at his Gopalapuram residence.

నిలకడగా రాజకీయ కురువృద్దుడి అరోగ్యం..

Posted: 07/30/2018 11:13 AM IST
Dmk chief is better recovering well says tamil nadu cm

తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి ప్రస్తుతం బాగానే వున్నారని, ఆయన వైద్య చికిత్సలతో చక్కగానే కోలుకుంటున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు. క్రితం రోజు రాత్రి ఆయన అరోగ్యం క్షీణించినట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కావేరీ ఆసుపత్రి వైద్యులు ప్రకటన నేపథ్యంలో ముఖ్యమంత్రి సేలం నుంచి తన పర్యటనను రద్దు చేసుకుని అర్థాంతరంగా చెన్నైకి చేరుకున్నారు. ఇవాళ కావేరి అసుపత్రికి చేరుకుని అక్కడి వైద్యులతో ఆయన కరుణానిధి అరోగ్యంపై వాకాబు చేశారు.

దీంతో రాత్రి మరింత క్షీణించిన కరుణానిధి ఆరోగ్యం కాసింత నిలకడగా కొనసాగుతుందని, ప్రస్తుతం ఆయన బాగానే కోలుకుంటున్నారని అస్పత్రి వైద్యులు తెలిపారని పళనిస్వామి మీడియాకు తెలిపారు. క్రితం రోజు రాత్రి హెల్త్ బులెటిన్ నేపథ్యంలో అక్కడే ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు, అభిమానులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఏదో జరిగిపోతోందన్న భావనతో వేలాదిమంది కార్యకర్తలు తరలివచ్చి ఆసుపత్రిని చుట్టుముట్టారు. గుండెలు బాదుకుంటూ రోదించారు.

ఆయన కుటుంబ సభ్యులు, ప్రముఖులు ఆసుపత్రికి చేరుకోవడంతో తమిళనాడు వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆసుపత్రితో పాటు డీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని పోలీస్ స్టేషన్లకు హెచ్చరికలు పంపారు. కరుణానిధి ఆరోగ్యం కొంతసేపు క్షీణించిన మాట వాస్తవమేనని, అయితే, ఆ తర్వాత చికిత్సకు స్పందించి కోలుకున్నారని పేర్కొన్నారు. కార్యకర్తలు వదంతులు నమ్మవద్దని, సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DMK  Karunanidhi  Kauvery hospital  Tamil Nadu CM  K palaniswami  chennai  

Other Articles