Sri Reddy Faces Prostitution, Extortion Charges చెల్లింపులే లేనిచోట వ్యభిచార చట్టమా: శ్రీరెడ్డి

Sri reddy dismisses prostitution allegations says no payment involved

Casting Couch, Sri Reddy, Varahi, prostitution, sexual allegations, blackmailing, Indian Makkal Mandra, Nani, Raghava Lawrence, Sundeep Kishan, Srikanth, director AR Murugadoss, Sundar C, karthi, Tollywood, Kollywood

Varahi, an actor and a practicing lawyer, has filed a police complaint against Sri Reddy. In his complaint, Varahi has accused Reddy of prostitution and has asked the Chennai Police to take immediate action against her.

ఆడబిడ్డని ఇక్కడ వదిలేస్తే.. అక్కడ వ్యభిచారిణిగా..

Posted: 07/25/2018 11:42 AM IST
Sri reddy dismisses prostitution allegations says no payment involved

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి.. పాపులారిటీ సంపాదించిన నటి శ్రీరెడ్డిపై కాలీవుడ్ భగ్గుమంటుంది. అమెపై ఏకంగా వ్యభిచారిణిగా ముద్రవేసి.. ఈ మేరకు వ్యభిచార నేరం కింద కేసును కూడా నమోదు చేయింది. టాలీవుడ్ లో అమె తెరపైకి తీసుకువచ్చిన కాస్టింగ్ కౌచ్ కు తొలుత పలువురు మద్దతు పలికారు. ఆ తరువాత అమె తన వాపును చూసి బలుపు అనుకుని.. ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పైనే అసభ్యపదజాలాన్ని వినియోగించింది.

దీంతో అమె తీసుకువచ్చిన అంశం మంచిదే అయినా. అమె ఎంచుకున్న ధోరణిపై మాత్రం టాలీవుడ్ లో మరీ ముఖ్యంగా అమెకు మద్దతునిస్తున్న వారిలో చీలికలు వచ్చాయి. అమె ఉద్యమం పక్కదారి పట్టిందని అమె వెనుక నిలిచేందుకు కూడా ఎవరూ లేకుండా పోయారు. దీంతో తన తట్టాబుట్టా సర్ధుకున్న నటి శ్రీరెడ్డి తన ఫోకస్ ను టాలీవుడ్ నుంచి కాలీవుడ్ కు షిప్టు చేసింది. అక్కడ నటులపై కూడా ఆమె తీవ్రస్థాయిలో అరోపణలు గుప్పించింది. అమె చేసిన అరోపణలపై ఇప్పటికే పలువురు కాలీవుడ్ తారలు అమెపై ఫైర్ అయ్యారు.

హీరో కార్తి కూడా అమె వద్ద సాక్ష్యాలు వుంటే.. పోలీసులను ఆశ్రయించాలే తప్ప.. వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా సోషల్ మీడియాను వేదిక చేసుకుని అరోఫణలు గుప్పించడం సరికాదని సూచించారు. అయినా అమె తన ధోరణిని మార్చుకోకుండా.. కాలీవుడ్ లోనూ తనను ఎంతో మంది వాడుకున్నారని చెబుతూ, సోషల్ మీడియాలో ఒక్కొక్కరి పేర్లనూ బయట పెడుతున్నారు. దీంతో అమెపై వ్యభిచార నేరం కింద కేసు నమోదైంది. ఇండియన్ మక్కల్ మంద్రం (ఐఎంఎం) అనే సంస్థ ఈ ఫిర్యాదు చేసింది.

చెన్నై పోలీస్ కమిషనర్ ను కలిసిన ఐఎంఎం సభ్యులు, ఆమె సినిమా అవకాశాల కోసం దర్శకులు, హీరోలు, ఇతరులతో గడిపినట్టు స్వయంగా అంగీకరిస్తున్నందున, అది వ్యభిచారం కిందకే వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఆరోపణలు భారత సంస్కృతిని, స్త్రీ జాతిని అవమానిస్తున్నాయని ఆరోపించారు. కాగా, శ్రీరెడ్డి ఇటీవలి కాలంలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన వారిపైనా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు మురుగదాస్, విశాల్ తదితరులపై శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది. దీంతో నడిగర్ సంఘం కూడా ఆమెపై చర్యలకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.

కాగా, తనపై వ్యభిచార చట్టం కింద కేసు నమోదు కావడంపై శ్రీరెడ్డి స్పందించింది. పోలీసులు తనపై వ్యభిచార చట్టం కింద కేసు నమోదు చేయలేదని కూడా తెలిపింది. వ్యభిచార చట్టం కింద కేసు నమోదు చేయాలంటే అక్కడ డబ్బు చెల్లింపులు జరగలేదని.. అలాంటప్పుడు తాను చేసింది వ్యభిచారం ఎలా అవుతుంది.? ఇదంతా నటుడు, న్యాయవాది అయిన వారాహి కేవలం పబ్లిసిటీ కోసం చేస్తున్న డ్రామాగా శ్రీరెడ్డి కొట్టిపారేసింది. తాను నడిగర్ సంఘంతో కూడా టచ్ లో వున్నానని, ఇప్పటికే విశాల్, నాజర్ తో చర్చించేందుకు సిద్దమని కూడా చెప్పానని అయితే వారు నుంచి ఇప్పటివరకు తనకు ఎలాంటి కబరు రాలేదని చెప్పారు. అయితే కాలీవుడ్ వర్గాలు మాత్రం డబ్బు కోసం చేసినా.. అవకాశం కోసం చేసినా.. ఆ పనులు వ్యభిచారం కిందకే వస్తాయని, ఇంకా మాట్లాడితే దానికితోడు బ్లాక్ మెయిలింగ్ సహా పలు సైబర్ చట్టాలు కూడా నమోదు చేయాల్సి వుంటుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles