Everyone must maintain Parliamentary decorum రాహుల్ జీ.. ఏమిటిదీ.? సభా గౌరవం ఏదీ.?

Rahul s hug everyone must maintain parliamentary decorum says speaker

no trust vote, no confidence motion, Rahul Gandhi, wink, hug, , Amit Shah, Sumitra Mahajan, BJP, congress, TDP, galla jayadev, kesineni nani, APSPS, special status, Andhra pradesh, NDA

Lok Sabha Speaker Sumitra Mahajan reprimanded Congress President Rahul Gandhi for giving a hug to PM Modi as a “drama” and said everyone must maintain decorum in Parliament.

రాహుల్ జీ.. ఏమిటిదీ.? సభా గౌరవం ఏదీ.?

Posted: 07/20/2018 07:04 PM IST
Rahul s hug everyone must maintain parliamentary decorum says speaker

లోక్ సభలో అత్యంత ఆసక్తికరంగా సాగుతున్న అవిశ్వాస తీర్మాణంపై చర్చ సందర్భంగా ప్రకంపనలు సృష్టించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీరు పట్ల స్పీకర్ సుమిత్రా మహజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ఆయన అలా ప్రవర్తించి ఉండాల్సి కాదని ఆమె అన్నారు. సభ్యులే సభా మర్యాదను కాపాడాలని ఆమె హితవు పలికారు. ఇంతకీ అంతలా రాహుల్ గాంధీ ఏం చేశారనేగా మీ డౌట్. అదేనండీ రాఫెల్ యుద్దవిమానాల అంశంలో పలు కంపెనీలకు మేలు జరిగేలా కేంద్రం తీసుకున్న నిర్ణయమని అరోపించడంతో పాటు నాలుగేళ్ల పాలనపై తూర్పారబట్టారు.

ఆ తరువాత తన ప్రసంగాన్ని ముగిస్తూ తనపై బీజేపి నేతలకు, ఆరెస్సెస్ వాదలుకు వున్న ద్వేషాన్ని తగ్గిస్తానని చెప్పిన రాహుల్ సభలో వున్న ప్రధానిని కౌగలించుకున్నారు. దీంతో విస్తుపోయిన స్పీకర్ ‘సభలో ఆయన నరేంద్రమోదీ కాదు. ఆయన ప్రధానమంత్రి సీటులో కూర్చుని ఉన్నారని మనం గ్రహించాలి. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఆ విషయాన్ని గుర్తుంచుకొని నడుచుకోవాలి. ఒకరు మరొకరిని వెళ్లి కౌగిలించుకోవడాన్ని నేను ఆపలేను. సభకు ఓ మర్యాద ఉంటుంది. రాహుల్‌ గాంధీ కౌగిలించుకొని వెళ్లిన తర్వాత కన్నుకొట్టారు.

అది సరైనది కాదు. రాహుల్‌ చేసిన పని నాకు నచ్చలేదు. సభా మర్యాదను కాపాడాల్సిన బాధ్యత సభ్యుల మీదే ఉంది’ అని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ పేర్కొన్నారు. రాహుల్‌ తన ప్రసంగం ముగించిన తర్వాత నేరుగా ప్రధాని మోదీ వద్దకు వెళ్లి ఆయన్ను కౌగిలించుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. అయితే.. సభను తప్పుదోవ పట్టించేందుకు రాహుల్‌ ఇలా ప్రవర్తించారంటూ భాజపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై నిరాధార ఆరోపణలు చేసి తర్వాత కౌగిలించుకున్నందుకు గాను రాహుల్‌పై సభా హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాల్సిందిగా బీజేపి నేతలు స్పీకర్‌ను కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : no confidence motion  Rahul Gandhi  wink  hug  Congress  Sumitra Mahajan  BJP  AP special status  NDA  

Other Articles