Wife of bank official who killed self found dead బ్యాంకు అధికారి ఆత్మహత్య.. భార్య హత్య..

Wife of bank official who killed self found dead

gandhi hospital, jamai osmania, mekala madhav, nallakunta, osmania general hospital, vidyanagar, Nalgonda district, New Nallakunta, Kethepally, Syndicate Bank, Vidyanagar railway station, telangana, crime news

In a twist to the suspected suicide of the assistant manager of Syndicate Bank in the city on Saturday, his wife was also found dead at their residence in Nallakunta.

బ్యాంకు అధికారి ఆత్మహత్య.. భార్య హత్య..

Posted: 07/23/2018 11:06 AM IST
Wife of bank official who killed self found dead

రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న కేసులో రైల్వే పోలీసులు సదరు వ్యక్తి ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారని గుర్తించారు. దీంతో అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్న్నాడని కేసును ఛేదిస్తున్న క్రమంలో పోలీసులు షాక్ అయ్యారు. బ్యాంకు అధికారి రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడితే.. ఆయన భార్య హత్యోదంతం వెలుగు చూడటంతో కలకలం రేగింది. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని నల్లకుంట పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లాకు చెందిన మాధవ్ (30)కు, అదే జిల్లాకు చెందిన సుమలత (25)తో గత సంవత్సరం వివాహమైంది.

నల్లకుంట సిండికేట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసే మాధవ్ కు, సుమలతకు గత ఏడాది వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన కొన్నాళ్లు సవ్యంగానే సాగిన వీరి సంపారంలో.. అనుమానం పెనుభూతమయ్యింది. దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. భార్యపై అనుమానాన్ని పెంచుకున్న మాధవ్, ఈ నెల 21న విద్యానగర్ సమీపంలో ఎంఎంటీఎస్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాధవ్ మృతి తరువాత సుమలత అదృశ్యం కావడంతో, ఆత్మహత్య వెనుక సుమలత ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఈ క్రమంలో కుమార్తె సుమలత జాడ తెలియని ఆమె తల్లిదండ్రులు నల్లకుంటలోని ఇంటికి వచ్చారు. తాళం వేసున్న ఇంటిని పగులగొడదామని ఇంటి యజమానికి చెప్పడంతో, ఆయన వారించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చిన తరువాత తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా, మంచంపై సుమలత మృతదేహం కనిపించింది. గొంతుకు చున్నీతో ఉరేసి, ఆపై దిండు ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి చంపినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అనుమానంతో ఆమెను హత్య చేసిన భర్త, ఇంటికి తాళం వేసి వెళ్లి, ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్న పోలీసులు, కేసును సమగ్రంగా దర్యాఫ్తు చేస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles