No-confidence motion against BJP accepted అవిశ్వాసంపై చర్చకు అధికారపక్షం ‘సై’.. అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్న విపక్షం

No confidence motion against bjp accepted ready for debate says govt

No-confidence motion, union government, ap special status, TDP, AP MPS, BJP, govt. ready for debate congress, sumitra mahajan, mallikarjun kharge, politics

Congress, TDP move no-confidence motion in Lok Sabha agianst the government, Speaker accepts the motion while government says there are ready to debate on the issues.

అవిశ్వాసంపై చర్చకు అధికారపక్షం ‘సై’.. అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్న విపక్షం

Posted: 07/18/2018 01:29 PM IST
No confidence motion against bjp accepted ready for debate says govt

పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజునే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీలు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభలో గంధరగోళ పరిస్థితిని తీసుకువచ్చారు. తమ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ ఎంపీలు సభలో నినాదాలు చేస్తూ పెద్దపెట్టును అరుస్తూ సభా కార్యక్రమాలకు అటంకం కలిగించేలా వ్యవహరించారు. ఇదే క్రమంలో టీడీపీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ఇచ్చిన అవిశ్వాస తీర్మాణంతో పాటు పలు విపక్షాలు ఇచ్చిన నోటీసులు కూడా అందాయని స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు.

టీడీపీ సహా పలు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు అందాయని.. వాటిపై చర్చకు సంబంధించిన తేదీ, సమయాన్ని 10 రోజుల్లో ప్రకటిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా అవిశ్వాసానికి ఎంతమంది ఎంపీలు మద్దతు పలుకుతున్నారని స్పీకర్ ప్రశ్నించగా... టీడీపీ, కాంగ్రెస్ సహా పలు విపక్ష సభ్యులు లేచి నిలబడ్డారు. నిలబడ్డవారి సంఖ్య 50కి పైగా ఉండటంతో, అవిశ్వాసంపై చర్చ జరుపుతామని తెలిపారు. నియమనిబంధనలను అనుసరించి, చర్చను చేపడదామని చెప్పారు.  

అదే సమయంలో టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మాణాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలో చదివి వినిపంచారు. అయితే కేవలం టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మాణాన్ని మాత్రమే స్పీకర్ సుమిత్రా మహాజన్ చదవి వినిపించడం.. మిగతా వాటిని సభలో చదవకపోవడంపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మాణం ఇచ్చిన అన్ని పార్టీల అవిశ్వాలను సభలో చదివి విపించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్.. తాను సభా వ్యవహారాల నిబంధనల ప్రకారమే తొలుత వచ్చిన టీడీపీ అవిశ్వాసాన్ని చదవి.. మిగతా పార్టీల పేర్లను చదివానని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles