live TV debate ruckus: Maulana Ejaz Arshad Qasmi arrested టీవీ లైవ్ డిబేట్ లో రచ్చ.. రచ్చ..

Maulana ejaz arshad qasmi arrested for assaulting advocate during live tv debate

live debate video, live debate today, triple talaq case, triple talaq bill, triple talaq case name, triple talaq article, triple talaq judgement, triple talaq unconstitutional, Triple Talaq, live debate show, Maulana Ejaz Arshad Kajmi, Farah Faiz, Supreme Court, lawyer, ZEE Hindustan, crime

Television live debate programme on Triple Talaq took a violent turn and ended up in an unpleasant note in Zee Hindustan news channel. One panelist Maulana Ejaz Arshad Kajmi assaulted fellow woman guest and Supreme Court lawyer Farah Faiz.

ITEMVIDEOS: టీవీ లైవ్ డిబేట్ లో రచ్చ.. రచ్చ.. మౌలానా అర్షద్ ఖాస్మీ అరెస్టు

Posted: 07/18/2018 03:09 PM IST
Maulana ejaz arshad qasmi arrested for assaulting advocate during live tv debate

పురుషాదిక్య సమాజంలో మహిళలు అనాదిగా అణిచివేతకు గురికాబడుతున్నారన్నది నిజమేనా అని అనిపించేలా టీవీ లైవ్ షోలోని చర్చ సందర్బంగా చోటుచేసుకున్న ఘటన ఎలుగెత్తి ప్రశ్నిస్తుంది. ముస్లిం మహిళలకు ఇస్లాం నష్టం చేసిందని చెబుతున్నట్లు ప్రకటిస్తున్న ఖాస్మిలు.. త్రిఫుల్ తలాక్ విషయమై ఏర్పాటు చేసిన లైవ్ టీవీ డిబేట్ లోకి వెళ్లి అక్కడ మాటా మాటా పెరిగి.. రచ్చ రచ్చ జరగడం.. దీంతో ఖాస్మీ.. ముస్లిం మహిళల తరపున తమ వాణిని బలంగా వినిపిస్తున్న అత్యున్నత న్యాయస్థానం న్యాయవాదిపై దాడి చేయడం.. ఫలితంగా అరెస్టుకు దారితీయడం అంతా జరిగిపోయింది.

ఈ హఠాణ్పారిణామంతో విస్తుపోయిన ఛానెల్ ప్రముఖులు వెంటనే ఖాస్మీని తమ స్టూడియో నుంచి బయటకు పంపించేసి.. ఆ తరువాత మహిళా న్యాయవాదితో చర్చను కోనసాగించారు. తమ ఛానెల్ ఎట్టి పరిస్థితుల్లో మహిళలపై దాడులను ప్రోత్సహించదని చెప్పిన సిబ్బంది.. ఇలాంటి ఘటనలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా చెప్పారు. ఇంతవరకు బాగానే వున్నా అసలేం జరిగిందన్నేది తెలుసుకోవాలని వుందా..? ట్రిపుల్‌ తలాక్ పై చర్చ న్యాయవాదిపై దాడికి ఎలా కారణమైందన్న వివరాలు ఇలా వున్నాయి.

జీ హిందుస్తాన్ హిందీ న్యూస్‌ చానెల్‌ చేపట్టిన త్రిపుల్ తలాక్ అనే అంశంపై చర్చ సందర్భంగా.. హాజరైన సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది ఫరాహ్ ఫైజ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. ట్రిపుల్‌ తలాక్ తో విడాకులు పొందాలనే అంశం అసలు ఖురాన్ లో లేనేలేదని వాదించారు. దీంతో అదే చర్చకు వచ్చిన ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సభ్యుడు మౌలనా ఇజాజ్ అర్షద్ ఖాస్మీ ఆమెపై దాడి చేశాడు. ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో ఖ్వాసి ఆమెపై అసభ్య పదాజాలంతో లైవ్‌ షోలోనే దాడికి దిగారని.. ఇది తాము సహించబోమని టీవీ ఛానెల్ చెబుతుంది.

అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అవుతుంది. దానిని క్షుణ్ణంగా పరిశీలిస్తే.. సహనం కోల్పోయింది ఎవరన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అసలేం జరిగిందన్న వాదప్రతివాదలు తెలియవు.. త్రిపుల్ తలాక్ అంశంపై ఖురాన్ లో ఏముందో లేదో తెలియదు కానీ వీడియోను పరిశీలిస్తే మొదట ఖాస్మీని పశువు అని తిట్టింది మాత్రం న్యాయావాదేనని.. దానిని నువ్వే పశువు అని ఖాస్మీ బదులిచ్చాడని, ఇక తొలుత చేయి చేసుకున్నది కూడా న్యాయవాదేనని స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తరువాత అమెపై ఆయన పలుమార్లు చెంపదెబ్బలు కొట్టాడు. నిజానిజాలు ఇలా వుంటే వాటిని వక్రీకరించే ప్రయత్నం చేసి.. ఖస్మిని కటకటాల వెనక్కి పంపారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles