Was a BJP MLA chased and beaten by voters? మాజీ ఎమ్మెల్యేను తరమితరమి కొట్టిన ప్రజలు

Was a bjp mla chased and beaten by voters

former mla chased by voters, rajasthan ex-mla chased by voters, bsp ex-mla chased by voters, congress ex-mla chased by voters, bjp ex-mla chased by voters, Vidhayak Shankar Lal Sharma, MLA Ramkesh Meena, former mla, Vidhayak Shankar Lal Sharma, MLA Ramkesh Meena, violent, viral video, democracy, politics

A video circulated on social media has caught 60,000 views since July 13 because it showed a rarity -- crowds chasing away a man purportedly identified as a BJP neta in Rajasthan.

ITEMVIDEOS: మాజీ ఎమ్మెల్యేను తరమితరమి కొట్టిన ప్రజలు

Posted: 07/17/2018 06:53 PM IST
Was a bjp mla chased and beaten by voters

విప్లవ చిత్రాల్లో తప్ప ఎక్కడా కనబడని ప్రజల తిరుగుబాటు.. అక్కడ మాత్రం సాక్ష్యాత్కరించింది. ఓ మాజీ ఎమ్మెల్యేను అక్కడి ప్రజలు తరమితరమి కొట్టారు. వెంటబడి మరీ కొట్టారు. ఇది ఏ దేశంలో అంటారా.? మన భారత దేశంలోనే. ఓటరు మహాశయులకు ఆగ్రహం వస్తే... రాజస్థాన్ లో అదే జరిగింది. దౌసా ప్రాంతంలో జరిగిన ఘటనలో ఓ ఎమ్మెల్యే ప్రజల చేతిలో తన్నులు తిన్న వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తిని ప్రజలు తరిమి తరిమి కొడుతుండగా తీసిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కగా, ఇందులో కనిపిస్తున్నది దౌసా బీజేపీ ఎమ్మెల్యే శంకర్ లాల్ శర్మ అంటూ ప్రచారం మొదలైంది.

 తెల్లటి కుర్తా, పైజమా ధరించిన వ్యక్తి ప్రజలతో దెబ్బలుతింటూ పరిగెత్తినట్టు కనిపిస్తుండగా, ఇందులో ఉన్నది గంగాపూర్ అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రంకేశ్‌ మీనా అన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై స్పందించిన శంకర్ లాల్, తన అనుచరులను వీడియోలో ఉన్నది ఎవరో కనుక్కోవాలని ఆదేశించగా, అసలు విషయం తేటతెల్లమైంది. తమ నేత పేరిట నకిలీ వీడియోలు ప్రచారం చేశారంటూ బీజేపీ కార్యకర్తలు కలెక్టర్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు.

కాగా, సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధ చట్టంపై దాఖలైన పిటిషన్ పై విచారించిన తరువాత చట్టానికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించిన సమయంలో నిరసన తెలుపుతుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన ప్రస్తుత కాంగ్రెస్‌ నేత, గతంలో బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రంకేశ్‌ మీనా అని తెలుస్తోంది. వీడియో విషయమై రంకేష్‌ ను సంప్రదించగా సమాధానం చెప్పేందుకాయన నిరాకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : former mla  Vidhayak Shankar Lal Sharma  MLA Ramkesh Meena  violent  viral video  

Other Articles