Swami Agnivesh beaten up in Jharkhand స్వామి అగ్నివేష్ పై బీజేపీ యువ మోర్చా కార్యకర్తల దాడి

Swami agnivesh alleges attack by bjp youth workers in jharkhand

activist, Swami Agnivesh, Swami Agnivesh attacked, BJP, BJP youth workers, BJP Yuva Morcha, Jharkhand police, Littipara, Pakur, Jharkhand , politics

Social activist Swami Agnivesh was allegedly attacked on Tuesday by workers of the Bharatiya Janata Party’s youth wing in Jharkhand’s Pakur district

స్వామి అగ్నివేష్ పై బీజేపీ యువ మోర్చా కార్యకర్తల దాడి

Posted: 07/17/2018 08:08 PM IST
Swami agnivesh alleges attack by bjp youth workers in jharkhand

ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ పై బీజేపీ యువమోర్చా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. జార్ఖండ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాంచీకి 365 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకుర్ లో ఓ కార్యక్రమానికి హాజరవడానికి అగ్నివేష్ వచ్చారు. హోటల్ నుంచి ఆయన బయటకు వస్తుండగా విల్లంబులు ధరించిన గిరిజనులు ఆయనకు భద్రతగా ఉన్నారు. ఇంతలోనే అక్కడకు ఒక్కసారిగా వచ్చిన బీజేవైఎం కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు. ఆయనను చితకబాదారు. కిండపడేసి కొట్టారు. నల్ల జెండాలు చూపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జైశ్రీరాం అంటూ ఆయనపై దాడి చేశారు.

ఘటన అనంతరం స్వామి అగ్నివేష్ మాట్లాడుతూ, ఎలాంటి హింసకైనా తాను వ్యతిరేకమని చెప్పారు. తనపై ఎందుకు దాడి చేశారో తనకు తెలియదని చెప్పారు. దాడిపై దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులను కోరానని తెలిపారు. తనపై దాడి జరిగిన సమయంలో చుట్టుపక్కల ఒక్క పోలీసు కూడా లేరని అన్నారు. బయట బీజేవైఎం కార్యకర్తలు తన కోసం వేచి ఉన్నారనే విషయాన్ని తాను హోటల్ లో ఉన్నప్పుడే తన స్నేహితులు తనకు చెప్పారని తెలిపారు.

కూర్చొని మాట్లాడుకుందాం రండని వారిని తాను ఆహ్వానించానని... కానీ ఒక్కరు కూడా రాలేదని చెప్పారు. ఒక సెమినార్ లో పాల్గొనేందుకు తన గిరిజన మిత్రులతో కలసి వెళ్తుండగా, దాడి చేశారని తెలిపారు. ఎలాంటి హెచ్చరిక లేకుండానే దాడికి దిగారని చెప్పారు. పిడికిళ్లతో గుద్దుతూ, కొడుతూ, రోడ్డుపై పడేసి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. దారుణమైన పదజాలాన్ని తనపై ఉపయోగించారని చెప్పారు. దాడిలో గాయపడ్డ స్వామి అగ్నివేష్ కు స్థానిక ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అగ్నివేష్ పై జరిగిన దాడి పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని భావిస్తున్నారు. దాడికి సంబంధించి 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : activist  Swami Agnivesh  BJP  BJP youth workers  Jharkhand  politics  

Other Articles