Woman stripped naked, burned for dowry భార్యను నగ్నంగా మంచానికి కట్టేసి.. భర్త దాష్టికం..

Woman stripped naked burned with hot ladle by husband in laws for bike

Woman stripped naked, Woman stripped naked and burn, agra, domestic voilence, physical harassment, in-laws, motorcycle in dowry, Firozabad, burned with hot ladle by husband, Gadi Bahu village woman striped, dowry, motorbike, ravi, anju, manju, subhas, ospal, Gadi Bahu village, Khushalpur village, Barhan police jurisdiction, uttar pradesh, crime

A 20-year-old woman was allegedly stripped naked, her limbs tied to a bed-frame and burned with a hot ladle by seven people, including her husband, for failing to bring a motorcycle in dowry. The crime was reported from a remote village in Firozabad district.

భార్యను నగ్నంగా మంచానికి కట్టేసి.. భర్త దాష్టికం..

Posted: 07/14/2018 04:05 PM IST
Woman stripped naked burned with hot ladle by husband in laws for bike

పుట్టింటి నుంచి కట్నం కింద మోటారు బైకును తీసుకురాలేదని ఓ భర్త దాష్టికానికి పాల్పడ్డాడు. నిద్రిస్తున్న భార్య గదిలోకి చోచ్చుకెళ్లిన భర్త.. అతని అక్కచెల్లుళ్లు, బావలు అంతాకలసి అమెను గదిలోనే నరకాన్ని చూపెట్టారు. అమె అర్థిస్తున్నా.. కనీసం కనుకరించని భర్త, అడపడచులతో పాటు సోదరసమానులైన వారి భర్తలు కూడా తనపై కర్కషంగా, అమానవీయంగా ప్రవర్తించారు. అమె కట్టుకున్న బట్టలను పూర్తిగా ఊడదీసి.. నగ్నంగా మార్చి.. అమెను మంచానికి కట్టేసి.. ఆ తరువాత పొత్తికడుపుతో పాటు తొడలపైన కాలుతున్న గరిటతో వాతలు పెట్టారు.

గత శనివారం ఈ ఘటన జరుగుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాక్షసుడైన భర్త, శూర్పనకలాంటి అడపడచులు, శకునిలాంటి వారి భర్తల నుంచి ఎట్టకేలకు గురువారం రాత్రి తప్పించుకోగలిగిన ఆమె.. తన తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు తమ గ్రామ పరిధిలోని బర్హాన్ పోలిస్ స్టేషన్లో తమ కూతురి కసాయి భర్తపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే., గడిబహు గ్రామానికి చెందిన రవి కుషాల్ పూర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతిని ఐదేళ్ల వివాహం చేసుకున్నాడు.

వివాహం అనంతరం కట్నంగా పుట్టింటి నుంచి మోటారుబైక్ తీసుకురాలేదని భర్త రవి అతని సోదరులు రాము, భోలా, సోదరీమణులు అంజూ, మంజూ, బావమరుదులు సుభాష్, ఒస్పాల్ లు కలిసి భార్య బట్టలు ఊడదీసి మంచానికి కట్టేసి గరిటను కాల్చి కడుపు, పెదాల వద్ద వాతలు పెట్టారు. అత్తింటి నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి తన పుట్టింటికి చేరి భర్త రవితోపాటు అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాధిత యువతికి వైద్యపరీక్షలు చేయించి నిందితులపై ఐపీసీ సెక్షన్ 489 ఏ, 323 ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి సంజయ్ వర్మ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dowry  motorbike  ravi  anju  manju  subhas  ospal  Gadi Bahu village  uttar pradesh  crime  

Other Articles