court filed charges against telugu couple in US sex racket మోదుగుమూడి దంపతులు దోషులే.. నిర్థారించిన కోర్టు..

Chicago court charges kishan modugumudi couple on ten counts including felony

Chicago court, Charges, high profile sex racket in Chicago, tollywood actress high profile sex racket, Kishan Modugumudi, chandrakala, court, Vibha Jayam, Chennupati, Tollywood actresses, anchors, temporary visas, Belmont Cragin, chicago, Chandrakala, flesh trade, Kishan Modugumudi, sreeraj, prostitution racket, Sex trafficking, Tollywood, US, America, crime

The Telugu-origin couple Kishan Modugumudi and Chandrakala Purnima Modugumudi, allegedly involved in a sex racket in the United States, have been charged by a US District Court on ten counts including Felony, which is a serious crime, under three sections.

మోదుగుమూడి దంపతులు దోషులే.. నిర్థారించిన కోర్టు..

Posted: 07/14/2018 03:23 PM IST
Chicago court charges kishan modugumudi couple on ten counts including felony

ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవమని మహాకవి  రాయప్రోలు సుబ్బారావు చెప్పిన మాటలను ాచరించకుంా.. అమెరికాకు వెళ్లి అక్కడ టాలీవుడ్ నటీమణులతో వ్యభిచారం చేయించిన ఘనదంపతులు మోదుగుమూడి కిషన్.. చంద్ర తెలుగువారి పరువును తీశారు. ఈ షికాగో సెక్స్ రాకెట్ కేసులో అమెరికా న్యాయస్థానం నిందితులైన మోదుగుమూడి దంపతులను దోషులుగా తేల్చింది. చిత్తు కాయితంతో వెలుగుచూసిన ఈ కేసులో త్వరగానే విచారణ పూర్తైంది.

ఇప్పటికే నిందితులైన మొదుగుమూడి దంపతులకు సంబంధించిన ఈ కేసులోని అధారాలన్నింటినీ సేకరించిన పోలీసులు వాటిని కూడా న్యాయస్థానంలో సమర్పించారు. దీంతో న్యాయస్థానం వారిని దోషులుగా నిర్ధారించింది. ఈ నెల 18న వీరికి శిక్ష ఖరారు చేయనుంది. వీరికి పదేళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈవెంట్ల పేరుతో హీరోయిన్లను అమెరికా రప్పించి.. అక్కడ వారితో వ్యభిచారం చేయించారన్న ఆరోపణలు నిజమేనని అమెరికా న్యాయస్థానం తేల్చింది. అనైతిక కార్యక్రమాల కోసం విదేశీ మహిళలను అక్రమంగా రవాణా చేసినట్టు తేల్చింది. వీసా పర్మిట్లను దురిన్వియోగం చేశారన్న ఫెడరల్ ఏజెన్సీ ఆరోపణలతో నార్త్ ఎలినాయ్ కోర్టు ఏకీభవించింది.

తెలుగు సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా పని చేసిన కిషన్.. తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యాడు. తనకున్న పరిచయాలతో నటీమణులను సెక్స్ రాకెట్లోకి లాగాడు. కొన్ని ఏళ్లపాటు తన భార్యతో కలిసి ఈ దందాను నడిపాడు. అమెరికాలోని తెలుగు సంఘాలకు ఈవెంట్ల కోసం సెలబ్రిటీలను సప్లయ్ చేసే కోఆర్డినేటర్‌ ముసుగులో నటీమణులను వ్యభిచార ఊబిలోకి లాగారు. కిషన్ మోదుగుమూడి విటులతో మాట్లాడుతున్న ఆడియో టేపులు ఆ మధ్య బయటకు వచ్చాయి.

శ్రీరాజు చెన్నుపాటి, విభ జయం పేరిట కిషన్ ఆయన భార్య చీకటి దందాను నడిపారు. కిషన్ దంపతుల వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన పోలీసులు విచారణ జరపగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నటీమణులు అమెరికా చేరుకోగానే వారి పాస్‌పోర్టులను లాగేసుకునే వారని, బలవంతంగా వారితో వ్యభిచారం చేయించేవారని తెలిసింది. ఒప్పుకోకపోతే రిటర్న్ టికెట్లు బుక్ చేయమని, పాస్‌పోర్టులు ఇవ్వమని బెదిరించే వారనే వార్తలు వెలువడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles