TRS MLA Durgam Chinnaiah Warns Councillor Daughter టీఆర్ఎస్ ఎమ్మెల్యే బెదిరింపులు.. బ్లాక్ మెయిలింగ్..

Trs mla durgam chinnaiah warns councillor daughter

bellampalli, bellampalli mla, trs, bellampally councillor, mla durgam chinnaiah, bellampalle, bellampalli councillors no confidence motion, bellampally, trs leaders warning, trs leaders phone calls leaked, bellampally trs, TRS MLA, Bellampalli, Durgam Chinnaiah, Warning, Councillor Daughter, No Confidence Motion, Municipal Chairperson, telangana, politics

Bellampalli TRS MLA Durgam Chinnaiah Warning Councillor Daughter over No Confidence Motion on Municipal Chairperson.

ITEMVIDEOS: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బెదిరింపులు.. బ్లాక్ మెయిలింగ్..

Posted: 07/05/2018 03:34 PM IST
Trs mla durgam chinnaiah warns councillor daughter

తెలంగాణలోని అధికార పార్టీలో వర్గ రాజకీయాలు తారాస్థాయికి చేరాయన్నది ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని పార్టీల నుంచి అనేక మంది నేతలు తెలంగాణ వచ్చి రాగానే వలసలు రావడం.. అది చాలదన్నట్లు గ్రామ, మండల, జిల్లా ప్రజాపరిషత్, స్థానిక సంస్థల ఎన్నికలలో ఇతర పార్టీల నాయకులను కూడా తమ పార్టీలోకి రప్పించుకుని వారికి టిక్కెట్లు ఇవ్వడంతో.. ముందునుంచి పార్టీలో కొనసాగుతున్న క్యాడర్ కు మధ్యంతరంగా పార్టీలోకి వచ్చిన క్యాడర్ కు మధ్య మన్సస్పర్థలు ఏర్పడి.. రాష్ట్రంలోని పలు చోట్లు వర్గరాజకీయాలకు వేదికగా మారిందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అయితే తన వర్గానికి చెందిన వ్యక్తే మున్సిఫల్ చైర్ పర్సెన్ గా కొనసాగాలన్న ఎమ్మెల్యే అదేశాలను కూడా ఖాతరు చేయకుండా తమకంటూ స్వేచ్చా, స్వతంత్ర్యం వున్న వారినే మున్సిఫల్ చైర్ పర్సెన్ గా ఎన్నుకుంటామని ఏకంగా జిల్లా కలెక్టర్ ను కలసి ఈ మేరకు ప్రస్తుతం కోనసాగుతున్న మున్సిపల్ చైర్ పర్సెన్ పై అవిశ్వాస తీర్మాణాన్ని ఇవ్వడానికి సిద్దమైన కౌన్సిలర్లపైన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఏకంగా బెదరింపులకు పాల్పడ్డాడు. తమ ప్రభుత్వం నడుస్తున్నప్పడు.. ప్రభుత్వాన్ని కాదని ఏ అధికారి కూడా ఏమీ చేయలేడని ఆయన బెదరింపులకు పాల్పడ్డాడు.

అయన ఫోన్ సంభాషణ లీక్ కావడం.. అది కాస్తా.. నెట్టింట్లో వైరల్ కావడంతో మీడియాలో కూడా ప్రముఖ వార్తైంది. ఇటీవలే సాగునీటి శాఖ ఏఈఈని ఇంటికి పిలిపించుకుని మరీ చివాట్లు పెట్టి విమర్శలను ఎదుర్కోన్న ఎమ్మెల్యే.. తాజా మున్సిఫల్ చైర్ పర్సెన్ పై అవిశ్వాసం పెట్టే కౌన్సిలర్ల క్యాంపులో వున్న ఓ కౌన్సిలర్ కూతురుకు ఫోన్ చేసి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడిన సంబాషణతో వెలుగు చూడటంతో పూర్తిగా పరువు పోగొట్టుకున్నారు. దీనిపై స్పందించేందుకు మీడియా ప్రయత్నాలు చేసినా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో బెల్లంప‌ల్లి మున్సి‌పాలిటీలో రాజకీయం ర‌స‌వ‌త్త‌ర‌ంగా మారింది.

ఛైర్‌ప‌ర్స‌న్ సునీతారాణి భర్త తమ వార్డులకు చెందిన అభివృద్ది పనులలోనూ తన పెత్తనం కొనసాగించడం మింగుడు పడని సొంతపార్టీ కౌన్సిలర్లు అమెపై అవిశ్వా‌సం పెట్టేందుకు నిర్ణ‌యించుకున్నా‌రు. ఎమ్మెల్యే అండదండలు మెండుగా వున్నాయన్న ధీమాతో ఆయన అగడాలకు అడ్డులేకుండా పోతుందని ఈ క్రమంలో అవిశ్వాసమే సరైన ఎత్తుగడని భావించారు. దీంతో ఓ కౌన్సి‌ల‌ర్ భ‌ర్త అసమ్మతి కౌన్సిలర్ల క్యాంపు రాజకీయానికి నేతృత్వం వహించాడు. వారిని హైదరాబాద్ కు క్యాంపుకు తరలించారని సమాచారం.

అయితే స్వప‌క్ష సభ్యుల అవిశ్వాస తీర్మాణం, క్యాంపు రాజకీయంపై సమాచారం అందుకున్న చైర్ పర్సెన్ భర్త.. విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అక్కడితో చెక్ పడని విషయం చివరకు మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా చేరింది. దీంతో ఆయన అవిశ్వాసం పెట్టనీయకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను అదేశించినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే.. మంత్రి కేటీఆర్ పేరు చెప్పి.. ఓ కౌన్సి‌ల‌ర్ కూతురికి ఫోన్ చేసి బెదిరించిన‌ట్లు అడియో టేపుల్ల నిక్షిప్తమైంది.

కౌన్సి‌ల‌ర్లు అంద‌రూ మున్సి‌ప‌ల్ కార్య‌ల‌యం నుండి బ‌య‌ట‌కు రాక‌పోతే ఎవ‌రిని ఎలా చేయాలో త‌న‌కు తెలుసున‌ని ఆయ‌న బెదిరించిన‌ట్లు కౌన్సి‌ల‌ర్లు తెలిపారు. అంతేకాదు ఇద్దరు కౌన్సిలర్లకు భూ వివాదాలు వున్నాయని వాటిని తామే అక్రమిస్తామని హెచ్చరించారు. అంతేకాదు సుధ అనే కౌన్సిలర్ భర్త ఓసిలో పనిచేస్తారని ఆయనను మణుగూరుకు బదిలీ చేస్తామని కూడా ఎమ్మెల్యే హెచ్చరించారు. క్యాంపు ఎక్కడున్నా కేటీఆర్ ఒక్క ఫోన్ చేస్తే అందరూ బయటకు వస్తారని కూడా దుర్గం చిన్నయ్య హెచ్చరికలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh