11 killed in firecracker godown fire in Warangal బాణాసంచా గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి..

11 dead in huge fire at cracker warehouse in telangana s warangal

bhagvan reddy, blast, chief minister, KCR, bombula kumar, ex-gratia, firecracker factory, fireworks factory, eumamula market yard road, fireworks factory,

At least 11 persons were killed and several others injured in an explosion at a fireworks factory in Kashibugga area on the outskirts of the city.

ITEMVIDEOS: బాణాసంచా గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి..

Posted: 07/04/2018 03:01 PM IST
11 dead in huge fire at cracker warehouse in telangana s warangal

వరంగల్‌ జిల్లా కోటిలింగాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లా పట్టణ కేంద్రం శివార్లలోని కాశీబుగ్గ ప్రాంతంలో వున్న భద్రకాళి ఫైర్‌ వర్స్క్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది కార్మికులు అక్కడికక్కడే విఘతజీవులుగా మారిపోయారు. పేలుడు ధాటికి కార్మికుల శరీరభాగాలు తునాతునకలైపోయాయి. దాదాపుగా రెండు వందల మీటర్ల దూరం వరకు కార్మికుల అవయవాలు ఎగిరిపడ్డాయి. కాగా ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని, వారిని స్థానిక ఎంజీఎం అసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో ఘటనాస్థలానికి చేరుకునే లోపు గోడౌన్ పూర్తిగా ధహనమైంది. రంగంలోకి దిగిన అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురై గుర్తుపట్టలేని విధంగా మారాయి. శిథిలాల కింద మరో రెండు, మూడు మృతదేహాలు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.విశ్వనాథర్‌ రవీందర్‌, డీసీపీ, ఏసీపీ తదితరులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

కోటిలింగాలలోని భద్రకాళి ఫైర్‌ వర్క్స్ గోదాములో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీ శబ్దాలతో బాణసంచా పేలింది. ఆ సమయంలో గోదాములో 25 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన వెంటనే పలువురు కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. 10మంది కార్మికులు మంటల్లో సజీవ దహనమయ్యారు. మరికొంత మంది ఆచూకీ తెలియకపోవడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఒక్కసారిగా భారీ శబ్దాలతో మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు విషయం తెలుసుకుని వెంటనే ప్రమాదస్థలానికి పరుగులు తీశారు. కార్మికుల మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles