metro ameerpet to lb nagar is all set to start అమీర్ పేట్ టు ఎల్బీనగర్ ముహూర్తం ఫిక్స్..

Metro ameerpet to lb nagar corridor one is all set to start

Ameerpet to LB Nagar, Metro corridor, secunderabad, Nampally, Hyderabad, Miyapur, Malakpet, Kukatpally, Begumpet, NVS Reddy, Hyderabad Metro Rail Limited, Telangana CM KCR, K chandrashekar rao, telangana

NVS Reddy, managing director of Hyderabad Metro Rail Limited (HMRL), said with works on the rest of Corridor One (Ameerpet to LB Nagar) expected to be completed by the end of July, the stretch will be thrown open to the public by month end.

అమీర్ పేట్ టు ఎల్బీనగర్ ముహూర్తం ఫిక్స్..

Posted: 07/02/2018 05:02 PM IST
Metro ameerpet to lb nagar corridor one is all set to start

ముహూర్తం కుదరింది. హైదరాబాద్ మహానగర మరో స్థాయికి తీసుకెళ్లిన మెట్రో రైలు.. గత ఏడు మాసాలుగా మియాపూర్ నుంచి నాగోల్ కు వెళ్లే ప్రయాణికులు అత్యంత వేగంగా చేరుకునే వెసలుబాటును కల్పించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభమైన మెట్రో సేవలు.. తాజాగా మరింత రద్దీ ప్రాంతమైన అమీర్ పేట నుంచి ఎల్బీ నగర్ వరకు సేవలను అందించనుంది. ఇందుకు గాను ముహూర్తం కూడా కుదిరింది. ఈ మార్గంలో వాహనదారులకు త్వరలోనే ట్రాపిక్ కష్టాలు తగ్గనున్నాయి.

ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మకమైన మార్గం అందుబాటులోకి తీసుకురానున్నారు మెట్రో అధికారులు. దీంతో ఎల్బీ నగర్-అమీర్ పేట్ రూట్ లో మెట్రో కూత మోగనుంది. ఇప్పటికే ట్రయల్ రన్, టెక్నికల్ పనులను పూర్తి చేసుకోగా, జూలై నెలాఖరున మెట్రోను పట్టాలెక్కించేందు రంగం సిద్ధం చేస్తున్నారు. జూలై 27న LB నగర్-అమీర్ పేట్ రూట్ లో మెట్రో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు అధికారులు.

16 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రూట్ లో రైళ్ల రాకపోకలకు అవసరమైన సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్, ట్రాక్షన్‌ వ్యవస్థ ఏర్పాటు వంటి పనులన్నీ పూర్తయ్యాయి. ఈ రూట్లో రైళ్లకు 18 రకాల పరీక్షలను వరుసగా నిర్వహిస్తున్నారు. ఈ మార్గానికి సంబంధించి త్వరలో రైల్వే శాఖ పరిధిలోని కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ సైతం అందనుంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వ వర్గాలు కచ్చితమైన ప్రారంభ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ రూట్ లో  75 వేల మంది రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles