Cops Probe Chilling Details Of Delhi "Death House" ఢిల్లీ ‘‘డెత్ హౌజ్’’ దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు..

11 bodies 11 pipes cops probe chilling details of delhi death house

Burari deaths, Burari Delhi, 11 killed Burari, Burari 11 killed, 11 of family killed, death house, Narayan Devi, Pratibha, Bhavnesh, Lalit Bhatia, delhi police, crime

As the police investigate the events leading to the death of 11 of a family in Delhi, strange and chilling details are being examined closely. One of them is 11 pipes protruding from one wall of the house, all set close together.

ఢిల్లీ ‘‘డెత్ హౌజ్’’ దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు..

Posted: 07/02/2018 04:17 PM IST
11 bodies 11 pipes cops probe chilling details of delhi death house

ఢిల్లీలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన  11 మంది డెత్ మిస్టరీపై... దర్యాప్తు చేస్తున్న కొద్దీ విస్తుపోయే విషయాలు బయట పడుతున్నాయి. వీరంతా ముందుగానే ప్లాన్ చేసుకుని సామూహిక ఆత్మహత్యలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో లభించిన నోట్స్‌ల ఆధారంగా ఈ ఘోరానికి క్షుద్ర పూజలే అనుమానిస్తుండగా... దీన్ని బలపరుస్తూ మరో కీలక విషయాన్ని అధికారులు వెలుగులోకి తెచ్చారు.
 
ఆ ఇంట్లో అనుమానాస్పదంగా పెట్టి ఉంచిన 11 పైపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృత దేహాలు వేలాడుతున్న తీరుకు,  పైపులు పెట్టిన స్థానాలకు సరిగ్గా సరిపోలుతుండడం మరింత అనుమానం రేపుతోంది. అందులో నాలుగు పైపులు పెద్దవిగా, మిగతావి చిన్నగా ఉండడంతో... ఆ నాలుగు పైపులు మగవాళ్లను, మిగతావి మహిళలను సూచించడానికే పెట్టారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఒక పైపు దూరంగా పెట్టి ఉంచడంతో... ఈ పైపుకి, మిగతా మృతదేహాలకు దూరంగా ఫ్లోర్‌పై కనిపించిన వృద్దురాలి మృతదేహానికి సంబంధం ఉందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
పోలీసులు కథనం ప్రకారం.. ఆ ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్న రెండు రిజిస్టర్లలో మోక్షం పొందడం గురించి ఏవేవో రాసి ఉన్నాయి. కుటుంబ సభ్యులంతా ఎలా ఆత్మహత్య చేసుకోవాలో చెబుతూ అందులో స్పష్టంగా రాసినట్టు సమాచారం. మోక్షం కోసం ఆ కుటుంబం చేస్తున్న ప్రార్థనలకు, వీరి మరణాలకు కూడా సంబంధం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. 2015 నుంచి ఈ కుటుంబం రిజిస్టర్‌లో రాస్తున్నారనీ.. తాము మరణించబోయే తేదీని కూడా అందులో రాశారని సమాచారం.

ఈ ఘటనపై వారి బంధువులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ వాళ్లంతా విద్యావంతులని, మూఢ నమ్మకాలను పాటించరని అంటున్నారు. దీనిపై మృతురాలు నారాయణ్ దేవి మనవడు కేతన్‌ నాగ్‌పాల్‌ స్పందింస్తూ.. తమ కుటుంబానికి ఆర్థిక సమస్యలేమీ లేవని అలాంటిప్పుడు ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడతారని ప్రశ్నించారు. ఇవి ముమ్మాటికీ హత్యలేనని అతడు అనుమానం వ్యక్తంచేశాడు. వారికి మూఢ విశ్వాసాలపై నమ్మకం లేదని, ఒకవేళ ఆత్మహత్యలు చేసుకుంటే ముఖాన్ని, నోర్లను, చేతులను కట్టేసుకుంటారా అని నిలదీశారు. కాగా ఈ కేసును విచారిస్తున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. ఇవి సామూహిక హత్యలా, లేక ఆత్మహత్యలా అనేదానిపై విచారించేందుకు ఏ ఒక్క కోణాన్ని విడిచిపెట్టడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  death mystery  11 people  Sucide  death house  delhi police  crime  

Other Articles