CM serious on own party mps ఎంపీల వ్యాఖ్యలపై సీఎం సీరియస్.. చలోక్తులకు సమయం కాదు..

Cm chandrababu serious on tdp mp jokes about hunger strike

telugu desam party, tdp mps, chandrababu, hunger strike, tdp mps on hunger strike, Anakapalli MP, Avanti Srinivasa Rao, Rajamundry, Ananthapur, JC Diwakar Reddy, Murali Mohan, TDP, viral video, andhra pradesh, politics

Andhra Pradesh Cheif Minister Chandrababu Naidu responded seriously on his own party parliament members after a video showing a purported casual banter.

ఎంపీల వ్యాఖ్యలపై సీఎం సీరియస్.. చలోక్తులకు సమయం కాదు..

Posted: 06/29/2018 02:16 PM IST
Cm chandrababu serious on tdp mp jokes about hunger strike

ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని.. ఇక రాష్ట్రానికి రావాల్సిన ఉక్కు పరిశ్రమను కూడా దక్కించుకోలేని పక్షంలో ఇక కష్టమని.. ఇక్కడి యువతకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని సహచర పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ పది రోజులుగా ఓ వైపు ఆమరణ నిరాహార దీక్షను చేస్తున్న క్రమంలో టీడీపీ ఎంపీలు హస్తినలోని కేంద్రమంత్రి చాంబర్ లోని వెయిటింగ్ హాల్లో చేసిన ఎటకారపు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీల సరదా కామెంట్లపై మండిపడిన ఆయన.. ఈ క్లిపింగ్ పై విచారణ చేయిస్తామన్నారు.

దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడికి సంఘీభావంగా వ్యవహరించాల్సిన సొంత పార్టీ ఎంపీలు ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... ఛలోక్తులకు ఇది సమయం కాదంటూ చురకలు అంటించారు. అయితే తమ మాటలను కత్తిరించారని చంద్రబాబుకు విరించారు ఎంపీ మురళీమోహన్... వాళ్లకు కావాల్సిన కామెంట్లను కట్ అండ్ పేస్ట్ చేశారని ఎంపీ అవంతి శ్రీనివాస్ చెప్పారు. దీంతో ఈ విషయంపై విచారణ జరుపుతున్నామన్నారు సీఎం చంద్రబాబు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రతీ ఒక్కరూ బాధ్యత, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరు బడితే వారు, ఏది బడితే అది మాట్లాడకూడదని ఆదేశించారు. మన పోరాటంపై బురద జల్లేందుకే కుట్రలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు... సరదాగా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చంద్రబాబు సూచించారు. రాష్ట్రం మొత్తం మన ధర్మపోరాటం వైపే చూస్తోందన్న ఏపీ సీఎం... మన ఎంపీల ఉద్యమంపై ఆశలు పెట్టుకున్నారని... ఉద్యమంలో ఒకేమాట-ఒకే బాట ఉండాలన్నారు. గతంలో జేసీ దివాకర్ రెడ్డి ఆవేదనతో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం చేశారని గుర్తు చేసిన ఆయన... ఇప్పుడు మురళీమోహన్ మాటలను కట్ అండ్ పేస్ట్ చేశారన్నారు. రాష్ట్రానికి హాని చేసే వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని... కుట్రదారుల చేతుల్లో పావులుగా మారొద్దన్నారు చంద్రబాబు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tdp mps  hunger strike  chandrababu  TDP  viral video  andhra pradesh  politics  

Other Articles