tears from godess idol.. devotees throng to spot దేవత విగ్రహం కంట కన్నీరు.. తండోపతండాలుగా భక్తులు..!

Tears from godess idol devotees throng to spot

ranganayaka sagar project, renuka yellamma thalli, chandlapur, siddipet yellamma, godess, idol, tears, fabtstucalness incident, devotees, siddipet, telangana, politics

In a fantsticalness incident, devotees of godess yellamma throng to the temple at siddipet as news spread that godess idol tears

దేవత విగ్రహం కంట కన్నీరు.. తండోపతండాలుగా భక్తులు..!

Posted: 06/29/2018 02:56 PM IST
Tears from godess idol devotees throng to spot

భక్తివిశ్వాసాలకు మన దేశంలో పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా ధక్షిణ భారతావనిలో ప్రతి జీవరాశిలోనూ దేవుణ్ణి చూసే తత్వం వుంది. ఏ అపద వచ్చినా దేవుళ్లను, దేవతలనే పరిష్కరిచాలని కోరుకుంటాం. అలాంటిది దేవతకే కష్టం వచ్చి కన్నీరు కారిస్తే.. దేవతలకు కష్టమా.. అని కొట్టిపారేడం హేతువాదులు చేసే పని అయితే.. దానిని కూడా పరిగణలోకి తీసుకుని అమ్మవారికి శాంతి చేకూర్చడం భక్తుల చేసే పని. వినడానికి కొంత వింతగా అనిపించినా.. ఇలాంటి అచారాలతో ముడిపడినదే మన ప్రాంతం. అందుకే ఇది పుణ్యభూమి అని కూడా కీర్తికెక్కింది.

అయితే కొందరు మాత్రం ఇది మూడభక్తి అని వ్యాఖ్యానించినా.. దేవుడి మీద మూఢభక్తి వుంటే తప్పేంటి అన్న ప్రశ్నలు సైతం భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో వేమచెట్టు నుంచి పాలు కారుతున్నాయన్న వార్తలు భక్తులను ఒకింత కలవరానికి గురిచేస్తే.. తాజాగా సిద్ధిపేటలోని రేణుకా ఎల్లమ్మ దేవత కన్నీరు కారుస్తుందన్న వార్త కలవరానికి గురిచేస్తుంది. అమ్మవారి విగ్రహం కన్నీరు కారుస్తుందన్న విషయం తెలుసుకున్న భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

జిల్లా పరిధిలోని చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్‌లోని రేణుక ఎల్లమ్మ ఆలయంలోని విగ్రహం నుంచి గత రెండు రోజులుగా కన్నీరు వస్తోందని ప్రచారం సాగుతోంది. రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భాగంగా, చంద్లాపూర్ గ్రామం ముంపు గ్రామమైంది. దీంతో అమ్మకు బాధకలిగిందని, అందువల్లే రేణుక ఎల్లమ్మ తల్లి ఏడుస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది తరలివచ్చి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక మరికొందరు భక్తులు మాత్రం సరిగ్గా బోనాలకు మరో పక్షం రోజులు వుందనగానే అమ్మవారు ఇలా కన్నీరు కార్చడమేంటని అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏ అనర్థానికి దారితీస్తుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : siddipet yellamma  godess  idol  tears  fabtstucalness incident  devotees  siddipet  telangana  politics  

Other Articles