Kadapa Bandh peaceful, complete కడపలో అఖిలపక్షం బంద్ ప్రశాంతం.. సంపూర్ణం

Kadapa bandh peaceful complete

cuddapah, kadapa, steel plant, cm ramesh, left parties, jana sena, ysr congress, congress, bsp,YS Jagan, Pawan Kalyan, K Ramakrishna, BV Raghavulu, Rajampet, Mydukur, Pulivendula, Jammalamadugu, Rayachoti, Proddatur

The Kadapa bandh called by the YSRCP, Jana Sena and the Left Parties demanding steel plant for Kadapa is peaceful and complete. All the buses in the district were confined to the eight depots in the district.

కడపలో అఖిలపక్షం బంద్ ప్రశాంతం.. సంపూర్ణం

Posted: 06/29/2018 11:58 AM IST
Kadapa bandh peaceful complete

ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన కడప జిల్లా బంద్‌ ప్రశాంతంగా సాగుతోంది. తెల్లవారుజామునే సీపీఎం, సీపీఐ రాష్ట్ర నాయకులు రోడ్లపైకి వచ్చి బంద్ దుకాణాలు తెరవకుండా అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వున్న ఎనిమిది డిపోల వద్దకు వెళ్లిన వామపక్షాల నేతలు వాటి ఎదురుగా ధర్నాలు చేయడంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లాలో దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని దుకాణాలను మూసివేశారు.

ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు బంద్‌ పాటిస్తున్నారు. బంద్‌ కారణంగా కడప నగరమంతా నిర్మానుష్యంగా మారింది. వామపక్షాల బంద్ పిలుపుకు ఇటు జనసేన, అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతో పాటు కాంగ్రెస్, బీఎస్పీ, ప్రజసంఘాలు కూడా మద్దతునివ్వడంతో బంద్ ఉదయం నుంచే ప్రశాంతంగా కొనసాగుతుంది. వామపక్ష రాష్ట్ర నాయకులు కె.రామకృష్ణ, బీవీ రాఘవులు బంద్ లో పాల్గొన్నారు.

బస్సులు లేకపోవడంతో బస్టాండు ప్రాంగణాలన్నీ బోసిపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు బస్సుల్లేక ఇబ్బందులు పడ్డారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజంపేట, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో బంద్ విజయవంతంగా కొనసాగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cuddapah  kadapa  steel plant  cm ramesh  left parties  jana sena  ysr congress  congress  bsp  politics  

Other Articles