TDP MPs' casual banter video goes viral on social media కడుపు మండినోళ్లు దీక్ష చేస్తే.. నిండినోళ్లు ఎటకారం..

Tdp mp jokes about joining colleague s hunger strike to lose weight video goes viral

telugu desam party, tdp mps, hunger strike, tdp mps on hunger strike, Anakapalli MP, Avanti Srinivasa Rao, Rajamundry, Ananthapur, JC Diwakar Reddy, Murali Mohan, TDP, viral video, andhra pradesh, politics

A video showing a purported casual banter of a group of TDP MPs in New Delhi about 'hunger-strike' has gone viral on social media today.

ITEMVIDEOS: కడుపు మండినోళ్లు దీక్ష చేస్తే.. నిండినోళ్లు ఎటకారం..

Posted: 06/29/2018 11:18 AM IST
Tdp mp jokes about joining colleague s hunger strike to lose weight video goes viral

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ అన్యాయం చేసిందని.. ప్రత్యేక ఫ్యాకేజీని ప్రకటించిన వెనక్కుపోయిందని, రాష్ట్ర ప్రజల హక్కైన హోదాను కూడా అందని ద్రాక్షాల మార్చిందని ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంపై మండిపడుతూ.. నిరసనదీక్షలను కొనసాగిస్తున్న తరుణంలో.. ఆ పార్టీ ఎంపీల తీరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వుంది. ఇక రాష్ట్రానికి ప్రకటించిన ఉక్కు పరిశ్రమను త్వరగా ఏర్పాటు చేయాలని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ గత పది రోజులుగా అమరణ నిరాహార దీక్ష చేస్తుంటే.. అందుకు అన్ని రకాల సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభిస్తుందని కూడా ముఖ్యమంత్రి కూడా కేంద్ర ఉక్కుశాఖా మంత్రి బీరేంద్ర సింగ్ కు లేఖను పంపారు.

అయితే కేంద్ర మంత్రి నుంచి తాము రమేష్ కు లేఖను పంపడంతోనే తమ పని పూర్తియ్యిందని భావిస్తున్న ఎంపీలు.. ఇంకా హస్తినలో తిష్ట వేసి.. రాష్ట్రానికి లభ్ది చేకూరేవరకు అక్కడే వుండాలన్న చంద్రబాబు అదేశాల నేపథ్యంలో అంతా కలసి ఓ చోట కూర్చోని మాట్లాడుకున్న తీరు.. ఇప్పుడు కలకలం రేపుతుంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాన్ చేసిన వ్యాఖ్యలను ప్రజలకు గుర్తువస్తున్నాయి. టీడీపీ ఎంపీలు తమ వ్యాపార వ్యవహారాల కోసమే ఎంపీలుగా గెలిచారే తప్ప.. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం కాదు.. అయితే ప్రత్యేక హోదాను ఎందుకు వదిలిపెడతారని.. వారి గెలిచిన ఏడాదికే పవర్ స్టార్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

అసలింతకీ టీడీపీ ఎంపీలు మాట్లాడుకున్నదేమిటీ..? అంటే.. బరువు తగ్గాలంటే దీక్షలకు దిగాలని ఎటకారపు వ్యాఖ్యలు చేశారు. జోను లేదు గీను లేదు అని అనకాపల్లి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ వ్యంగంగా వ్యాఖ్యలు చేయగా, వెంటనే తాను ఐదు కేజీల వరకూ బరువు తగ్గాలని అనుకుంటున్నట్టు చెప్పిన మరో టీడీపీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్, ఓ వారం రోజుల పాటు దీక్షలో కూర్చోగలనని అన్నారు. ఆ వెంటనే కల్పించుకున్న దివాకర్ రెడ్డి, 'ఈయన్ను పెడదాం... డన్' అంటూ సెటైర్ వేశారు.  

దీంతో మరో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కల్పించుకుంటూ, "ఆయన్ను మొదటి రోజే రాంమనోహర్ లోహియా ఆసుపత్రికి తీసుకెళ్లాం... ఈయనెందుకు?" అని అన్నారు. రవీంద్రకుమార్ ఈ మాటనగానే అక్కడే ఉన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు 'అదేకదా' అని అనడంతో ఎంపీల మధ్య నవ్వులు విరబూశాయి. ఈ మీటింగ్ లో ఎంపీలు కేసినేని నాని, బుట్టా రేణుక తదితరులు కూడా కనిపిస్తున్నారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతుండగా, పలువురు నెట్ జనులు మాత్రం రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కడుపుమండినోళ్లు దీక్ష చేస్తుంటే.. కడుపు నిండినోళ్లు ఎటకారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles