Man tried to kiss lady reporter on air మహిళా రిపోర్టర్ కు ముద్దివ్వబోయి..

World cup reporter warns at man who tried to kiss her on camera

Julia Guimaraes, Brazilian sports reporter, World Cup, Sexual harassment, TV Globo, SportTV, Moscow, Russia, Journalism

A Brazilian sports reporter fought back after a man tried to kiss her while she was doing a live report from the World Cup in Russia.

ITEMVIDEOS: మహిళా రిపోర్టర్ కు ముద్దివ్వబోయి..

Posted: 06/26/2018 02:33 PM IST
World cup reporter warns at man who tried to kiss her on camera

ఓ మహిళా జర్నలిస్టు రష్యాలోని ఫుట్ బాల్ వర్డల్ కప్ ను లైవ్‌లో కవరేజ్ చేస్తూ పీటుసీ ఇస్తున్న క్రమంలో అమె వద్దకు వచ్చిన ఓ క్రీడాభిమాని అమెను ఒక చెత్తో ఒడిసి పట్టకుని మరో వైపు అమెతో ఏదో చెప్పవాడిలా వచ్చి ఏకంగా బుగ్గన ముద్దుపెట్టేసి వెళ్లాడు. అమె మాత్రం తన పీటుసీకి అంతరాయం కలగకుండా తన పనితాను కొనసాగించింది. ఆ తరువాత ఆమె ఈ వీడియోను తన సోషల్ మీడియాలో పెట్టి తనకు కలిగిన బాధను, అవేదనను పంచుకున్నారు. ఆ తర్వాత ముద్దు పెట్టిన వ్యక్తి స్పందించి క్షమాపణ కోరాడు. స్నేహితులతో పందెం కాసినందుకే ముద్దు పెట్టానని వివరణ ఇచ్చాడు.

రష్యాలోనే ఇలాంటి సంఘటన మరొకటి జరగబోయింది. అయితే సమయానికి అప్రమత్తమైన మహిళా జర్నలిస్టు ఆకతాయి నుంచి తప్పించుకుని అతడిపై విరుచుకుపడింది. రష్యా వేదికగా ఫిఫా ప్రపంచకప్ పోటీలు జరుగుతున్నాయి. టోర్నీలో భాగంగా ఆదివారం జపాన్‌-సెనెగల్ మధ్య ఎకతెరిన్ బర్గ్ వేదికగా మ్యాచ్ జరిగింది. బ్రెజిల్‌ నుంచి వచ్చిన మహిళా రిపోర్టర్ జులియా ఈ టోర్నీని కవర్ చేస్తోంది. ఈ క్రమంలో జపాన్‌-సెనెగల్ మధ్య మ్యాచ్‌ ప్రారంభానికి ముందు లైవ్ లో మాట్లాడేందుకు సిద్ధమైంది. అదే సమయంలో ఓ అభిమాని అటుగా వచ్చి ఆమెకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు.

ఇది గమనించి అప్రమత్తమైన ఆమె వెంటనే పక్కకు తప్పుకుంది. అంతటితో ఆమె ఊరుకోలేదు. ‘మరోసారి ఇలా చేయకు. అర్థమైందా? ఇలాంటివి నేను సహించను. ఇది సరికాదు. మహిళల పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తించకండి. వారికి గౌరవం ఇవ్వండి’ అని హెచ్చరించింది. దీంతో అతడు ఆమెను క్షమాపణ కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మెగా టోర్నీ జరిగే సమయంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడంపట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles