TDP leaders held in sri gouthami's murder case శ్రీగౌతమిది హత్యే.. నిందితులందరూ టీడీపీ నేతలే..

Sri gouthami s is a pre planned murder reveals ap cid

sri gowthami, pavani, accident, pre-planned murder, cid investigation, TDP leaders, Zptc member, ap police, narsapuram, west godavari, andhra pradesh, crime

Andhra Pradesh CID police mystery beyond the Sri Gouthami Murder Case in West Godavari says its not accident case, but a pre-planned murder and made arrests of five people belongs to this case are TDP leaders.

శ్రీగౌతమిది హత్యే.. నిందితులందరూ టీడీపీ నేతలే..

Posted: 06/26/2018 03:03 PM IST
Sri gouthami s is a pre planned murder reveals ap cid

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఏడాదిన్నర కిందట మృతిచెందిన శ్రీగౌతమి కేసు మలుపు తిరిగింది. ద్విచక్రవాహనం ప్రమాదంలో శ్రీగౌతమి మృతిచెందినట్లు అప్పట్లో పోలీసులు ప్రకటించారు. అయితే కుటుంబసభ్యుల ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఆమెది హత్యగా తేల్చారు. ఈ హత్యతో ప్రమేయం ఉన్న నలుగురు నిందితుల్ని పాలకొల్లు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అరెస్టైనవారిలో తెదేపా నాయకుడు వీరవెంకట సత్యనారాయణ, నరసాపురం జడ్పీటీసీ బాలం ప్రతాప్, బాలం ఆండ్రూ, రమేశ్‌ ఉన్నారు. ఇందులో వీరవెంకట సత్యనారాయణను ప్రధాన నిందితుడిగా చేర్చారు.

శ్రీగౌతమిని వీరవెంకటసత్యనారాయణ తన స్నేహితులతో కలసి పథకం ప్రకారమే హత్యచేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. శ్రీగౌతమిని వీరవెంకటసత్యనారాయణ రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యతో విడాకులు తీసుకొని తన వద్దే ఉండాలని ఆమె సత్యనారాయణను ఒత్తిడి చేయడంతో అడ్డు తొలగించుకునేందుకు పథకం వేశాడు. ఏడాదిన్నర కిందట పాలకొల్లు నుంచి ద్విచక్రవాహంలో వస్తున్న శ్రీగౌతమిని కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శ్రీగౌతమి అక్కడికక్కడే మృతిచెందా... చెల్లెలు పావని గాయాలతో బయటపడింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు దీన్ని ప్రమాదంగా పరిగణించి కేసును మూసివేశారు. అయితే శ్రీగౌతమిని ప్రమాదం కాదని.. హత్య అని ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles