MP CM says Ajay Singh Allegations are Height Of Cheapness కుమారులపై మాజీ సీఎం భార్య పిర్యాదు.. పోలీసు కేసు..

Mp cm says ajay singh allegations are height of cheapness

Government of India, State governments of India, Lok Sabha, Ajay Singh, Madhya Pradesh, Indian films, Arjun Singh, Shivraj Singh Chouhan, magistrate, Bhopal MP, Congress, Chief Minister, Alok Sanjar, Governor, Bhopal, Leader, BJP leader, Anandiben Patel, tutor, UN, crime

Saroj Kumari (83), the mother of Abhimanyu Singh and Ajay Singh and the wife of Congress stalwart late Arjun Singh, yesterday filed a complaint in a magistrate's court here against her sons

కుమారులపై మాజీ సీఎం భార్య పిర్యాదు.. పోలీసు కేసు..

Posted: 06/21/2018 10:03 AM IST
Mp cm says ajay singh allegations are height of cheapness

కన్నతల్లిని వేధించారన్న అరోపణలపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత అర్జున్ సింగ్ కుమారుడు అజయ్ సింగ్ పై పోలీసు కేసు నమోదైంది. తన తల్లిని వేధించడంతో పాటు అమెను ఇంటి నుంచి గెంటివేయించారని అర్జున్ సింగ్ భార్య సరోజ్ కుమారి పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో అజయ్ సింగ్ సహా ఆయన భార్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, తన తల్లి తనపై పిర్యాదు చేయడంలో రాజకీయ కుట్రకోణాలు వున్నాయిని అజయ్ సింగ్ అరోపిస్తున్నారు. తమ ఇంటి విషయాల్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కల్పించుకుని రాజకీయం ఇబ్బందులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. తన తల్లికిని మచ్చిక చేసుకుని తనపై ఆరోపణలు చేయించి, తల్లీ బిడ్డల మధ్య దూరం పెంచుతున్నారని అజయ్ సింగ్ ఆరోపిస్తున్నారు.

రాజకీయంగా తనను నేరుగా ప్రజాక్షేత్రంలో ఎదర్కోనడానికి ఇబ్బందులు పడుతున్న శివరాజ్ సింగ్ చౌహాన్.. తనపై ఇలా కుట్రలకు తెరలేపారని అరోపించారు. ఇక ఇందులో భాగంగానే గృహహింస చట్టాన్ని తనపై ప్రయోగించాలని చూస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై చౌహాన్ స్పందిస్తూ, ఎవరి కుటుంబ విషయాల్లోనూ కల్పించుకోవాల్సిన అవసరం తనకు లేదని, కొడుకుపై స్వయంగా తల్లే ఫిర్యాదు చేస్తుంటే తానేం చేయాలని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles