సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్ తాజాగా ఓ అభిమాని చేసిన పనికి ఫిదా అయ్యాడు. ఏకంగా ట్విట్టర్ వేదికగా ఆయనకు వందనం చేస్తున్నట్లు నమస్కార వున్న ఎమోజీని తన ఖాతాలో పెట్టి అందరి నేతలకు అదర్శంగా నిలిచాడు. నాయకులపై కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు, శ్రేయోభిలాషులకు ఎంతో అభిమానం వుంటుందన్న విషయం తెలిసిందే. అయితే తమ జీవితంలో ఆ అభిమాన నేతలను కేవలం టీవీల్లోనే, లేక ఇతరాత్ర మాధ్యమాల్లోనే కలవడమే తప్ప.. వారితో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా భేటీ కాని అభిమానులు కోకొల్లలు.
అలాంటి వారికి తమ అభిమానాన్ని చాటుకునే వేదికగా సోషల్ మీడియా నిలుస్తుందనడంలో సందేహమే లేదు. అలాంటి సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడో వ్యక్తి. తాను చేసిన పనిని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన్ను కూడా ఫిదా చేశాడు. ఏం చేశాడంటారా? మారుతి సుజుకి సంస్థకు చెందిన కారును కొనుగోలు చేసిన సదరు కేటీఆర్ వీరాభిమాని, దాని నంబర్ ప్లేట్ లో 'కేటీఆర్' అన్న అక్షరాలు వచ్చేలా చూసుకున్నాడు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కేటగిరీలో దాన్ని రిజిస్టర్ చేయించాడు.
'టీఎస్ 11 కే టీఆర్ 5343' నంబర్ ను కారుకు లభించేలా చూసుకుని, దాన్ని ట్విట్టర్ లో పోస్టు చేస్తూ, కేటీఆర్ ను ట్యాగ్ చేశాడు. "కేటీఆర్ గారు... మీరు ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు" అని క్యాప్షన్ పెట్టాడు. ఇది కేటీఆర్ దృష్టికి రావడంతో, అతని అభిమానానికి ఫిదా అయిన కేటీఆర్, 'నమస్కారం' చేసే ఎమోజీని ఉంచారు. ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, 'టీఎస్ 11 కే' సిరీస్ లో రిజిస్టర్ అయ్యే కమర్షియల్ వాహనాలన్నింటికీ పక్కనే 'టీఆర్' ఉంటుంది. అంటే సుమారు 9,999 వాహనాల నంబర్ ప్లేట్లలో 'కేటీఆర్' అన్న అక్షరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more