President Kovind approves Governor's rule in J&K జమ్మూకాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన..

President ram nath kovind approves governor s rule in jammu and kashmir

governor's rule in JandK, Governor's Rule, mehbooba mufti, Jammu and kashmir, President Kovind, governor NN Vohra, PDP-BJP alliance

A day after BJP pulled out of its alliance with PDP, the state of Jammu and kashmir has come under Governor's rule with immediate effect.

జమ్మూకాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన.. తక్షణం అమల్లోకి..

Posted: 06/20/2018 10:19 AM IST
President ram nath kovind approves governor s rule in jammu and kashmir

జమ్ముకశ్మీర్ లో అనూహ్యంగా రాజకీయ కల్లోలం ఏర్పడి శరవేగంగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. బీజేపి చారిత్రక అవకాశానికి తిలోదకాలు ఇచ్చి.. పిడీపీ ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకున్న తరుణంలో దేశాధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలన తక్షణం అమల్లోకి వస్తుందని ఆయన ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో జమ్మూకాశ్మీర్ లో గవర్నర్‌ ఎన్ఎన్ వోహ్రా పాలన సాగుతుంది. జమ్మూకాశ్మీర్ ఫ్రజలు ఏ పార్టీకి అనుకూలమైన తీర్పుఇవ్వని నేపథ్యంలో బీజేపి-పీడీపీ పార్టీలు కలసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అనూహ్యంగా బీజేపి తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో.. మైనారిటీలో పడిన పీడీపి ప్రభుత్వానికి మరో ప్రత్యమ్నాయం లేక.. ముఖ్యమంత్రి పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. దీంతో గవర్నర్‌ పాలన విధించాలంటూ గవర్నర్‌ ఎన్‌.ఎన్‌.వోహ్రా రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. ఆ ప్రతిని కేంద్ర హోంశాఖకు కూడా పంపించారు. ఈ సిఫార్సుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇవాళ ఉదయం ఆమోదం తెలిపారు. దీంతో కశ్మీర్‌లో ఇవాళ్టి నుంచి మరోమారు గవర్నర్‌ పాలన అమల్లోకి వచ్చింది.

కశ్మీరు లోయలో భదత్రా పరిస్థితులు మెరుగుపరచడంలో పీడీపీ విఫలమైందని అరోపిస్తున్న బీజేపి.. మరి మూడేళ్లల్లో రావణకాష్టంలా నిత్యం రగిలిన సందర్బాలలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా.. తాజాగా 2019 ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం తీసుకోవడంలో రాజకీయ ఎత్తుగడలు వున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పీడీపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దరిమిలా.. ఉపముఖ్యమంత్రిగా బీజేపి నేత, ఇక మంత్రులుగా కూడా బీజేపి ఎమ్మెల్యేలు వ్యవహరించిన పక్షంలో వారికి కూడా బాధ్యత వుంటుందన్న విషయాన్ని బీజేపి మర్చిపోయిందా.? అన్న విమర్శలు వస్తున్నాయి.

ఇక పెరిగిపోతున్న ఉగ్రవాదం, భద్రతా వైఫల్య కారణాలను ఎత్తిచూపి.. తమ చేతులకు ఎలాంటి మట్టి అంటకుండా.. మొత్తం నేరాన్ని పీడిపీపై తోసేయడంపై బీజేపి రాజకీయ ఎత్తుగడ వేసిందని.. ఈ ఎత్తుగడలో పిడీపీ విఫలమైందని కూడా విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో 87అసెంబ్లీ స్థానాలున్న జమ్ముకశ్మీర్‌లో పీడీపీకి 28 సీట్లు, బీజేపికి 25 స్థానాలు దక్కాయి. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి 15 సీట్లు, కాంగ్రెస్ కు 12సీట్లు, ఇతరులకు 7 స్థానాలు లభించాయి. కాగా పీడీపీ, బీజేపి కలిసి ప్రభుత్వాన్నిఏర్పాటు చేశాయి.

ఎన్‌.ఎన్‌.వోహ్రా 2008 నుంచి జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు కశ్మీర్‌కు సంబంధించి చర్చల్లో పాల్గొనే కీలక వ్యక్తిగా పనిచేశారు. ఆయన కశ్మీర్‌లో ఉన్న ఈ పదేళ్ల సమయంలో మూడు సార్లు గవర్నర్‌ పాలన విధించారు. అలాగే తాజా గవర్నర్‌ పాలనతో జమ్ముకశ్మీర్‌లో 1977 నుంచి ఎనిమిదో సారి గవర్నర్‌ పాలన విధించారు. గవర్నర్‌ ఎన్‌.ఎన్‌. వోహ్రా ఇవాళ మధ్యాహ్నం ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరంగా సాగే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles