Lakhs looted in Rourkela bank robbery సినీపక్కీలో.. పట్టపగలు నగరంలో బ్యాంకు దోపిడీ..

Rs 40 lakh looted by armed men from bank in rourkela

Armed bank Robbery, Madhusudan Marg bank Robbery, Rourkela bank Robbery, Orissa bank Robbery, Indian Overseas Bank Robbery, cashier Mangaraj Jena, assistant branch manager J P Sohala, branch manager, Sanjay Kumar Jha, CCTV hard disc, Madhusudan Marg bank Robbery, Rourkela bank Robbery, Orissa bank Robbery, Indian Overseas Bank, Madhusudan Marg, Rourkela, Orissa

A group of armed men allegedly barged into a nationalised bank on the busy Madhusudan Marg in Rourkela and escaped with around Rs. 40 lakh after holding the staff and customers at gunpoint.

సినీపక్కీలో.. పట్టపగలు నగరంలో బ్యాంకు దోపిడీ..

Posted: 06/20/2018 11:03 AM IST
Rs 40 lakh looted by armed men from bank in rourkela

ఒడిశాలోని రూర్కెలా నగరంలో సినీపక్కీలో పట్టపగలు బ్యాంకు దోపిడీ జరిగింది. ముసుగులు ధరించిన దొంగలు అయుధాలను చేతబట్టి బ్యాంకులోకి చొరబడి ఏకంగా 44 లక్షల రూపాయలతో పరారయ్యారు. మధ్యాహ్నం సమయంలో జరిగిన ఈ చోరీ విషయం బయటకు తెలియడండో ఒక్కసారిగా సంచలనంగా మారింది. రూర్కెలా నగరంలోని మధుసూదన్ లేన్ ప్రాంతంలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు శాఖలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యాంకు అధికారులు దొంగల దోపిడిపై పోలీసులకు సమాచారం అందించడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం యథావిధిగా బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 8 మంది దోపిడీ దొంగలు ముఖాలకు మాస్క్‌లు, హెల్మెట్‌లు ధరించి మారణాయుధాలతో బ్యాంకులోకి ప్రవేశించారు. సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు సిబ్బందిని, బ్యాంకులోని వినియోగదారులను తుపాకితో బెదిరించారు. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను తీసుకుని అందరినీ ఓ గదిలో బంధించారు.

అనంతరం లాకర్లను పగలగొట్టి అందులో ఉన్న రూ.44 లక్షలు దోచుకున్నారు. వెళ్తూవెళ్తూ సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. హార్డ్ డిస్క్‌లను తీసుకుని పరారయ్యారు. మార్గమధ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా కచేరి శాఖకు చెందిన ఇద్దరు సిబ్బందిని అడ్డగించి బెదిరించి వారి వద్ద ఉన్న రూ.4 లక్షలు తీసుకుని ఉడాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకుకు చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. నగరం నుంచి బయటకు వెళ్లే అన్ని మార్గాలను మూసివేసి సోదాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Armed bank Robbery  Indian Overseas Bank  Madhusudan Marg  Rourkela  Orissa  

Other Articles